Site icon HashtagU Telugu

Fact Check : అన్నను పెళ్లాడిన చెల్లి.. వైరల్ వీడియోలో నిజమెంత ?

Hindu Woman Marrying Brother Fact Check Shakti Collective Scripted Video

Fact Checked By boomlive 

ప్రచారం : ఓ యువతి తన సోదరుడిని పెళ్లి చేసుకొని, గర్భవతి అయిందని చెబుతూ ఒక వీడియో వైరల్ అవుతోంది. 

వాస్తవం :  అది ఎడిట్ చేసిన ఫేక్ వీడియో. కంటెంట్ క్రియేటర్ కన్హయ్య సింగ్ దీన్ని సృష్టించాడు. ఈ వీడియోను వినోద ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించారు. 

ఓ బాలిక తన సోదరుడిని పెళ్లి చేసుకుందని, ఆమె గర్భవతి అయిందని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను కన్హయ్య సింగ్ అనే కంటెంట్ క్రియేటర్ రూపొందించాడని BOOM(Fact Check) గుర్తించింది. ఈ వీడియోను ఆయన వినోద ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించారు. ఈవిషయంపై వీడియోలో ‘నిరాకరణ’(డిస్‌క్లెయిమర్)ను కన్హయ్య సింగ్ ప్రచురించారు. అంతేకాదు తన ఫేస్‌బుక్ పేజీలో  ‘చిలిపి వీడియోలు చేసే’ కంటెంట్ క్రియేటర్‌గా తన గురించి  కన్హయ్య రాసుకున్నారు. ఈ వీడియో నిడివి 1 నిమిషం 30 సెకన్లు.  ఈ వీడియోలో ఒక అమ్మాయి తాను సోదరుడిని పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం ఒకటిన్నర నెలల గర్భవతిగా ఉన్నానని చెప్పినట్టుగా సీన్ ఉంది. తమ కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ  తన సోదరిని పెళ్లి చేసుకున్నానని ఆమెతో పాటు ఉన్న ఒక అబ్బాయి చెబుతూ కనిపించాడు.

పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆర్కైవ్‌ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read :Female Mosquitoes Vs Semen : రక్తం పీల్చే ఆడదోమలపైకి విష వీర్యంతో ఎటాక్.. సంచలన ప్రయోగం

ఫ్యాక్ట్ చెకింగ్‌లో..

  • అన్నా, చెల్లెలి పెళ్లి పుకార్ల వీడియోను కేవలం వినోద ప్రయోజనాల కోసమే తయారు చేశామని కంటెంట్ క్రియేటర్ కన్హయ్య సింగ్ వెల్లడించాడు. దీనిపై వీడియోలో నిరాకరణను ప్రచురించాడు. మీరు వీడియోలో ఈ అంశాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు.
  • మేం ఇదే టాపిక్‌పై ఇంటర్నెట్‌లో కీ వర్డ్ సెర్చ్ చేశాం. ఈక్రమంలో కన్హయ్య సింగ్ Facebook ప్రొఫైల్‌ను గుర్తించాం . అతడు తన Facebook పేజీలో జనవరి 1, 2025న ఈ వీడియోను ఎడిట్ చేసిన ఫుల్ లెంత్ వర్షన్‌ను ఒరిజినల్‌గా అప్‌లోడ్ చేశాడు.  దాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి . ఆర్కైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ వీడియోకు సంబంధించిన  ఫుల్ లెంత్ వర్షన్‌లో సదరు బాలిక మాట్లాడుతూ.. ‘‘ఆ అబ్బాయి నా సొంత సోదరుడు కాదు. నా మామ కొడుకు’’ అని స్పష్టంగా చెప్పింది.
  • ఈ వీడియోను తయారు చేసిన కంటెంట్ క్రియేటర్ కన్హయ్య తన ఫేస్‌బుక్ బయోలో “చిలిపి వీడియోలు” తయారు చేసే “వీడియో సృష్టికర్త” అని రాసుకున్న విషయాన్ని మేం గుర్తించాం. కన్హయ్య Facebook పేజీ ఆర్కైవ్‌ను ఇక్కడ చూడొచ్చు.
  • కన్హయ్య సింగ్ తయారు చేసిన మరిన్ని ఎడిటెడ్ చిలిపి వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
  • కన్హయ్య సింగ్ తయారు చేసిన ఫుల్ లెంత్ వీడియోలోని కొంత భాగాన్ని కట్ చేసి దాన్ని వైరల్ చేశారు. తనతో ఉన్న వ్యక్తి సొంత అన్న కాదని.. మామ కొడుకు అని బాలిక చెప్పే సీన్ లేకపోవడంతో అందరూ అపార్థం చేసుకున్నారు.

Also Read :Instant Phone Charging : రెప్పపాటులోనే ఫోన్ ఛార్జింగ్.. ‘స్విప్పిట్ హబ్’ వచ్చేసింది

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా boomlive వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)