Site icon HashtagU Telugu

Fact Check: నాగ చైతన్య ‘తండేల్’ చూసి సమంత కన్నీళ్లు?

Samantha Tears For Naga Chaitanya Thandel Movie Fact Check

Fact Checked By Newsmeter

ప్రచారం : నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమాను చూసి సమంత కన్నీళ్లు పెట్టుకుంది.

వాస్తవం : ఈ ప్రచారం తప్పు. వైరల్ అవుతున్న సమంత వీడియో క్లిప్ పాతది.

Also Read :Upcoming Kumbh Melas: ముగిసిన మహా కుంభమేళా.. తదుపరి కుంభమేళాలు ఇవే..

నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను చూసి.. నాగ చైతన్య మాజీ భార్య, హీరోయిన్ సమంత కన్నీళ్లు పెట్టుకుంది అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో సమంత ఉన్న ఒక వీడియో క్లిప్, నాగ చైతన్య(Fact Check) ఉన్న వీడియో క్లిప్, ఇద్దరి పెళ్లి ఫోటోలు కనిపిస్తున్నాయి. “తండేల్ సినిమా చూడడానికి సమంత సీక్రెట్‌గా వెళ్లింది.  నాగచైతన్యను చూసి ఆమె ఎంతగా ఏడుస్తుందో చూడండి” అని ఆ వీడియోపై క్యాప్షన్ రాశారు.

“తండేల్ సినిమా చూస్తూ ఏడుస్తున్న సమంత” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు 22 లక్షల వ్యూస్, 50 వేల లైక్స్ వచ్చాయి. (ఆర్కైవ్)

వాస్తవ తనిఖీలో గుర్తించిన అంశాలివీ..

  • ఈ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది.
  • వైరల్ అయిన పోస్ట్‌లోని సమంత వీడియో క్లిప్ పాతది. ఈ క్లిప్‌కు తండేల్ సినిమాతో సంబంధమే లేదు.
  • ఈ వీడియో గురించి ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మేం సెర్చింగ్ చేశాం. “శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత ఇబ్బంది పడుతోంది” అనే టైటిల్‌తో 2023 జనవరి 10న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో  మాకు దొరికింది. ఆ వీడియోలో 1:24 నిమిషం వద్ద  ఉన్న సన్నివేశాన్ని కట్ చేసి.. వైరల్ వీడియోగా మార్చారు.
  • వైరల్ వీడియో క్లిప్‌ను 2023 జనవరి 9న జరిగిన శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తీశారు అని మేం గుర్తించాం.
  • ఆ యూట్యూబ్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. సూటిగా కళ్ళల్లోకి వెలుగు పడుతుండటంతో సమంత ఇబ్బంది పడినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
  • కీవర్డ్ సెర్చ్ ద్వారా ఇదే సందర్భాన్ని మరో కోణంలో చూపిస్తున్న యూట్యూబ్ వీడియో ఒకటి మేం గుర్తించాం.  ఈ వీడియోలో 0:24 నిమిషం వద్ద సమంత లైట్ వల్ల ఇబ్బందిపడటం, మొహం తిప్పుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది.
  • “పాపం సమంత.. శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇబ్బంది పడ్డ సమంత” అనే టైటిల్‌తో 2023 జనవరి 9న ఈ  వీడియోను అప్‌లోడ్ చేశారు.
  • సమంత  తండేల్ సినిమా చూసినట్లుగా మాకు ఎలాంటి కథనాలు ఇంటర్నెట్‌లో దొరకలేదు.
  • సమంత సోషల్ మీడియాను కూడా మేం చెక్ చేశాం.  సమంత ఈ సినిమాను చూసినట్లుగా కానీ, ఆ  సినిమా గురించి మాట్లాడినట్లుగా కానీ ఎలాంటి పోస్టులు మాకు దొరకలేదు.

కాబట్టి వైరల్ వీడియోలో చేసిన ప్రచారమంతా తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)