Dev Deepawali : ఈనెలలోనే ‘దేవ్ దీపావళి’ ఉంది. అయితే ఈసారి పండుగ తేదీపై కొంత చర్చ నడుస్తోంది. ఈసారి దేవ్ దీపావళిపై భద్ర ప్రభావం ఉందని కొందరు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. రాహుకాలం, భద్ర కాలం శుభకార్యాలకు మంగళకరమైనవి కావు అని వారు అంటున్నారు. ఉదయ తిథి ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబర్ 15న (శుక్రవారం) వచ్చింది. ఆరోజున ఉదయం 6.19 గంటల నుంచి నవంబర్ 16న మధ్యాహ్నం 2.57 గంటల వరకు ఇది కొనసాగుతుంది. అందుకే ఆ రోజున దేవ్ దీపావళి జరుపుకుంటారు. అయితే ఉదయం 6.43 నుంచి సాయంత్రం 4.37 గంటల వరకు భద్రకాలం, ఉదయం 10.44 నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు రాహుకాలం ఉంటుందని తెలిపారు. భద్ర ప్రభావం, రాహు కాలం కారణంగా ఈసారి దేవ్ దీపావళి ప్రదోష కాల ముహూర్తం నవంబర్ 15న సాయంత్రం 05:10 గంటల నుంచి 07:47 గంటల వరకు ఉంటుంది. ఆ రోజున పూజకు మొత్తం 2.37 గంటల సమయం మాత్రమే ఉందని చెబుతున్నారు.
Also Read :Trump Peace Plan : రష్యా – ఉక్రెయిన్ వార్.. డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళిక ఇదీ
శివుడి విజయం
రాక్షసులపై శివుడు సాధించిన విజయానికి గుర్తుగా ‘దేవ్ దీపావళి’ని(Dev Deepawali) జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు అంతమొందించాడు. ఈ పండగ రోజునే శివుడి కుమారుడు కార్తికేయుడి జన్మదినం కావడం విశేషం. హిందూ దేవతలు స్వర్గంలోనూ ఈ పండగను జరుపుకుంటారని భక్తులు నమ్ముతారు.
Also Read : Russia : అమెరికాకు చెక్.. ఉత్తర కొరియాతో పుతిన్ మెగా డీల్.. ఏమిటి ?
ఈసారి దేవ దీపావళి రోజున గజకేసరి యోగం ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు వృషభ రాశిలో ఉండటం వల్ల గురువుతో కలిసి గజకేసరి యోగాన్ని సృష్టిస్తాడు. ఆ టైంలో శని, శుక్ర, బృహస్పతి స్థానాల వల్ల శశ రాజయోగం, పరివర్తన యోగం ఏర్పడుతాయి. వాటి ఫలితంగా వృషభం , మిథునం, కుంభ రాశి వారు అదృష్టవంతులుగా మారుతారు.