August – Birthday : వచ్చేది ఆగస్టు నెల. ఆగస్టు నెలలో మనలో ఎంతోమంది బర్త్‌డే ఉంటుంది. ఆ నెలలో పుట్టిన వారి గురించి జ్యోతిష్య పండితులు(Astrologers) ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
- ఆగస్టు నెలలో పుట్టినవారికి ఎక్కువగా కలలు వస్తుంటాయి. అయితే కలలు కనే స్వభావం వీరిలో కొందరిని అందలం ఎక్కిస్తుంది. మరికొందరిని సోమరులుగా మారుస్తుంది.
- ఆగస్టులో పుట్టినవారు(August – Birthday) రిలాక్స్ గా కనిపిస్తుంటారు. అవసరమైన సందర్భాల్లో వీరు కూడా కోపంతో రగిలిపోతారు.
- ఆగస్టులో పుట్టిన వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, వినయం, విధేయత ఎక్కువ.
- ఆగస్టులో పుట్టినవారు ఇంటా బయటా మంచి గౌరవాన్ని పొందుతారు.
- వీరు ఏదైనా పనిని అనుకున్న వెంటనే ప్రారంభిస్తారు.
- వీరికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది.
- ఆ నెలలో పుట్టినవారు కుటుంబ సభ్యులందరిపై ప్రేమను కురిపిస్తారు. వృత్తి, ఉద్యోగాలపై గౌరవాన్ని ప్రదర్శిస్తారు.
- ఆగస్టులో పుట్టినవారికి ఒంటరితనం నచ్చదు.
Also Read :Benefits Of Sleep: మీరు ఎక్కువసేపు నిద్రపోతున్నారా.. అయితే మీకు బోలెడు ప్రయోజనాలు..!
- ఆ నెలలో పుట్టినవారికి డబ్బు విషయంలో లక్కు కలిసి రాదు.
- ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలదు.
- అత్యవసరం అయిన సమయాల్లో ఇబ్బంది పడతారు.
- ఆగస్టులో పుట్టినవారికి సోమ, బుధ, ఆదివారాలు కలిసొస్తాయి. వీరికి ఆకుపచ్చ, కాషాయ రంగులు లక్కును అందిస్తాయి.
- ఈ నెలలో పుట్టినవారికి కంటికి, గుండె సమస్యల ముప్పు ఎక్కువ.
Also Read :Burping: త్రేన్పులు పదే పదే వస్తున్నాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమట..!
ఆగస్టు నెలలో బుధుడు, శుక్రుడు, కుజుడు తమ రాశిని మార్చుకోబోతున్నారు. ఆగస్టు 5న బుధుడు సింహరాశిలోకి, ఆగస్టు 16న సూర్యదేవుడు సింహరాశిలోకి, ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి, ఆగస్టు 26న కుజుడు మిథున రాశిలోకి సంచరించనున్నాయి. దీంతో వృషభ, సింహ, వృశ్చిక, మకర రాశుల వారికి ఈ నెల అద్భుతంగా ఉండబోతుంది.