Site icon HashtagU Telugu

Weekly Horoscope : వారఫలాలు.. మే 19 నుంచి మే 25 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

Weekly Horoscope 2025 May Horoscope Astrology Astro Predictions Zodiac Signs

Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 మే 19 నుంచి మే 25 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో  తెలుసుకుందాం.

మేష రాశి  : ఈవారంలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి.  ఇతరులతో వాదనకు దిగొద్దు. ఆర్థిక వ్యవహారాల్లో మీకు ఊరట లభిస్తుంది. కొందరి వల్ల మీ మనసుకు ఇబ్బంది కలగొచ్చు.  నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. పెళ్లి వ్యవహారాల్లో పండితుల సలహాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో బీ అలర్ట్.

వృషభ రాశి: ఈ వారంలో  వృషభ రాశి వారికి ధన యోగం ఉంది. పెట్టుబడులు కలిసొస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటుతో గజిబిజి నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్‌గా ఆలోచించండి. అనుభవం కలిగిన వారి సలహా పొందండి. కోర్టు వ్యవహారాలు కలిసొస్తాయి. పాత అప్పులు వసూలవుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి.  విలాసాలకు పోవద్దు.దుబారా ఖర్చులు చేయొద్దు.

మిథున రాశి: ఈ వారంలో మిథున  రాశి వారికి  గొడవలు, వాగ్వాదాలు, కలహాలు, అపార్ధాలు ఎదురుకావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. వీలైనంత తక్కువ మాట్లాడండి. ప్రతీ పదం జాగ్రత్తగా వినియోగించండి. ఆవేశం వద్దు. సహనం ముద్దు. కుటుంబ సభ్యుల సహకారం, సలహాలు తీసుకోండి. వ్యాపారస్తులకు కాలం కలిసొస్తుంది. లాభాలు పండుతాయి. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్స్ వస్తాయి.

Also Read :Yuvagalam : ‘యువగళం కాఫీ టేబుల్ బుక్’ ఆవిష్కరించిన ప్రధాని.. సంతకం చేసి లోకేశ్‌కు బహూకరణ

కర్కాటక రాశి :  ఈ వారంలో కర్కాటక  రాశిలోని(Weekly Horoscope) ఉద్యోగులు, వ్యాపారులు అలర్ట్‌గా ఉండాలి.  చిన్నపాటి పొరపాట్లు కూడా పెద్ద సమస్యలు కొని తెచ్చే రిస్క్ ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఆన్‌లైన్ లావాదేవీలలో బీ అలర్ట్. కొత్తవారిని వెంటనే నమ్మొద్దు.  కొత్త వ్యాపారాల గురించి ఆలోచన తగ్గించి, ఉన్న వ్యాపారంపై ఫోకస్ పెట్టండి. ఉద్యోగులు కూడా ఇప్పుడున్న ఉద్యోగంపై మనసు పెట్టి పనిచేస్తే బెటర్.

సింహ రాశి :  ఈ వారంలో సింహ రాశి  వారికి  బృహస్పతి యోగం ఉంది. దీనివల్ల దైవబలం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొన్ని అవాంతరాలు రావొచ్చు. ఆచితూచి వ్యవహరించండి. మీ శత్రువులే మిత్రులుగా మారే ఛాన్స్ ఉంది. జీవిత భాగస్వామి  ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.  దూర ప్రయాణాల్లో జాగ్రత్త.

కన్యారాశి  : ఈవారంలో కన్యారాశి వారు గొడవలకు, వివాదాలకు  దూరంగా ఉండాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చొద్దు.  సహనం అవసరం. ఆవేశం వద్దు.  వ్యాపారంలో అంతగా లాభాలు రావు. సంయమనం అవసరం. మీ వ్యాపార ప్రణాళికను  ఒకసారి రివ్యూ చేసుకోండి. నిపుణుల సలహాలతో దాన్ని మార్చుకోండి.  ఏదైనా పెద్ద అవకాశం రావొచ్చు. అందిపుచ్చుకోండి.

తులారాశి:  ఈ వారంలో తులారాశి వారికి  భాగ్య బృహస్పతి యోగం ఉంది. ముఖ్యమైన పనులు ఉంటే ఈవారంలో అస్సలు వాయిదా వేయొద్దు. ప్రేమ వ్యవహారాల్లో గొడవలు జరగొచ్చు. జాగ్రత్తగా ఉండండి. అతివిశ్వాసం, అత్యుత్సాహం దెబ్బతీయొచ్చు. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. కోర్టు వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.

వృశ్చికరాశి: ఈవారంలో వృశ్చికరాశి వారికి పాత పెట్టుబడులు లాభాలను పండిస్తాయి. కొత్త పెట్టుబడులకూ ఇది మంచిటైమే. వ్యాపారులు తమ వ్యాపార ప్రణాళికల్లో, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి.  లేదంటే మార్కెట్లో భంగపాటు తప్పదు.  పోటీని తట్టుకోలేరు. ప్రైవేటు ఉద్యోగులకు మంచి టైం వస్తుంది. ఏవైనా ఆటంకాలు వస్తే సమయస్ఫూర్తితో వ్యవహరించండి.

Also Read :Worlds First AI Doctor : ప్రపంచ తొలి ఏఐ డాక్టర్‌, ఏఐ క్లినిక్.. పనిచేసేది ఇలా

ధనుస్సు రాశి : ఈ వారంలో ధనుస్సు రాశి వారు ఆస్తులు కొంటారు. వస్తువులు కొంటారు. విలాసాలకు పోవడం మంచిది కాదు. దుబారాను మానేయండి. ఆస్తిపాస్తుల కొనుగోలు, అమ్మకాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు బీ అలర్ట్. మీ మాటల వల్ల ఇతరులతో గ్యాప్ పెరిగే ముప్పు ఉంది. వ్యాపారంలో విజయం దక్కొచ్చు. అయితే అత్యుత్సాహం వద్దు.

మకర రాశి :  ఈ వారంలో మకర రాశి వారికి అప్పులు పెరిగే ముప్పు ఉంది. కొత్త అప్పులు చేయొద్దు. వడ్డీల భారం పెరిగిపోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మానసిక ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది.  ఉన్నదాంట్లోనే సర్దుకోండి. ఉన్న ఆదాయంలోనే అన్ని రకాల సర్దుబాట్లు చేసుకోండి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నించండి.  పెద్దల సలహాలు తీసుకోండి.

కుంభరాశి :  ఈ వారంలో కుంభరాశి వారికి పలు విజయాలు లభిస్తాయి. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి.  దూర ప్రయాణాలు కలిసొస్తాయి. ఇతరులకు చెప్పి ప్రయాణాలు మొదలుపెట్టొద్దు.  పాత వ్యాపారాన్ని బలోపేతం చేయండి. కొత్త బిజినెస్ ఇప్పుడొద్దు. ఉద్యోగులకు శుభకాలం మొదలైంది.

మీన రాశి : ఈ వారంలో మీన రాశి వారికి లక్ కలిసొస్తుంది. ఉద్యోగులు, వ్యాపారుల్లో పలువురికి ఈ అవకాశం దక్కుతుంది. అంత మాత్రాన అత్యుత్సాహాన్ని ఎక్కడ ప్రదర్శించకండి. సాదాసీదాాగా ఉండండి. తక్కువ మాట్లాడండి. అప్పుల నుంచి బయటపడే ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకోండి. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి వాటిని వాడుకోండి.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.