Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతాయి. ఫలితంగా ఒక్కో రోజులో ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తుంటాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. రాశిఫలాలు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 జనవరి 19 నుంచి జనవరి 25 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ వారంలో మేష రాశివారి ఆదాయం పెరుగుతుంది. అయితే కొన్ని పనులు పూర్తి చేసే క్రమంలో వ్యయ, ప్రయాసలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీకు ఎదురు ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం
ఈవారంలో వృషభ రాశివారు(Weekly Horoscope) పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టాలి. వారికి తగిన సహాయ సహకారాలు, సలహాలు అందించాలి. పెళ్లి సంబంధాలు వెతుకుతున్న వారు గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులకు మంచి రోజులు వస్తాయి. వారికి మంచి ఉపాధి మార్గం లభిస్తుంది. ఆస్తి వ్యవహారం సెటిల్ అవుతుంది.
కర్కాటకం
ఈవారంలో కర్కాటక రాశివారి చేతికి డబ్బు అందుతుంది. అవసరాలు తీరుతాయి. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. బంధువుల వివాదాల్లో తలదూర్చకూడదు. డబ్బు విషయంలో తొందరపాటుతో ఎవరికీ వాగ్దానాలు ఇవ్వకండి.
మిథునం
ఈవారంలో మిథున రాశిలోని యువతకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఏకంగా విదేశాల నుంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే దిశగా తలుపులు తెరుచుకుంటాయి. ఉద్యోగం మారేందుకు ఇది మంచి టైం.
సింహం
ఈవారంలో సింహరాశి వారు బిజీగా ఉంటారు.వృత్తి, వ్యాపారాల్లో నిమగ్నం అవుతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సమయస్ఫూర్తితో ముందుకు కదిలితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గృహ, వాహన రుణాల ఒత్తిడి నుంచి మీరు బయటపడతారు. జీవిత భాగస్వామితో గొడవ జరిగేే ముప్పు ఉంది.
కన్య
ఈవారంలో కన్య రాశివారు ఆర్థికంగా బలపడతారు. అయితే అనవసర ఖర్చులు ఎక్కువ చేయకూడదు. పొదుపుగా వ్యవహరించండి. ఉద్యోగాల్లో ఉన్న వారు గుడ్ న్యూస్ అందుకుంటారు. ఆస్తిపరమైన లాభం రావొచ్చు.
తుల
ఈవారంలో తుల రాశిలోని ఉద్యోగులపై పనిభారం పెరుగుతుంది. అయినా ఓపికతో, కూల్‌గా పని కానివ్వండి. సహనం, సమయ స్ఫూర్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధించి శుభవార్తలు వస్తాయి.
వృశ్చికం
ఈవారంలో వృశ్చిక రాశివారికి పనిభారం పెరుగుతుంది. అయితే ఆదాయం కూడా పెరుగుతుంది. పనిని, జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగండి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది. కొన్ని విషయాలలో వ్యయ ప్రయాసలకు గురవుతారు.
ధనుస్సు
ఈవారంలో ధనుస్సు రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అయితే తోబుట్టువులతో ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.వ్యాపార విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేయండి.
మకరం
ఈవారంలో మకర రాశివారికి చాలా ఏళ్లుగా రావాల్సిన మొండి బకాయిలు చేతికి అందుతాయి. వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అనవసర ఖర్చులు వద్దు. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
కుంభం
ఈవారంలో కుంభరాశి వారికి ఉద్యోగపరమైన ఒత్తిడి ఉంటుంది. అయితే శాలరీ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ ఆఫర్లు వస్తాయి. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి.
మీనం
ఈవారంలో మీనరాశి వారికి అప్పుల బాధ తీరుతుంది. పాత మొండి బకాయిలు చేతికి అందుతాయి. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు.ప్రయాణాల్లో జాగ్రత్త. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.