New Year First Week : అందరికీ.. హ్యాపీ న్యూఇయర్. కొత్త సంవత్సరం మొదటి వారానికి సంబంధించిన రాశిఫలాల కోసం అందరూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో జనవరి 1 నుంచి జనవరి 7 మధ్య కాలానికి సంబంధించిన వారఫలాలను నిపుణులు ఇచ్చిన విశ్లేషణ ఆధారంగా మీకు అందిస్తున్నాం.
Also Read :Pushpa 2 Collections : ‘పుష్ప 2 ది రూల్’ 25వ రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందంటే..
మేషరాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో మేష రాశి వారు ఆచితూచి నిర్ణయాలు(New Year First Week) తీసుకోవాలి. అపార్థాలకు తావు ఇవ్వకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. కొత్త ప్రయత్నాలు చేయకండి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. గతం నుంచి వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ధనవ్యయం జరిగే అవకాశం ఉంది. బంధువుల నుంచి ఒత్తిడులు రావచ్చు. నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలిస్తాయి.
వృషభ రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో వృషభ రాశివారు ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వారం మధ్యలో వ్యయప్రయాసలు ఎదురవుతాయి. బంధువులతో వైరం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోండి. చెడు ఆలోచనలు అస్సలు రానివ్వకండి. మొహమాటానికి పోవద్దు. ఎరుపు, నీలం రంగులు అనుకూలిస్తాయి.
మిథున రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో మిథున రాశివారు ఆత్మీయులు, బంధువులతో అకారణంగా తగాదాలు పడే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు గందరగోళ పరిస్థితులు ఎదురు కావచ్చు. వారం చివరిలో మానసిక ఆందోళనలు తలుపుతట్టే ఛాన్స్ ఉంది. మీ శక్తికి మించిన పనులు చేయొద్దు. శక్తికి మించిన లక్ష్యాలను పెట్టుకోవద్దు. ఉద్యోగులు పనిలో జాగ్రత్తపడాలి. మాట పట్టింపులకుపోతే మీకు నష్టమే జరుగుతుంది. పరిస్థితులకు తగినట్టు కూల్‌గా స్పందించాలి. పసుపు, ఆకుపచ్చ రంగులు అనుకూలిస్తాయి.
కర్కాటక రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో కర్కాటక రాశివారు ధన వ్యయంగా నుంచి దూరంగా ఉండాలి. ఓర్పు, నేర్పుతో ముందుకు సాగాలి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టొచ్చు. వ్యాపార విస్తరణకు సరైన సమయం ఇదే. వ్యాపార విస్తరణలో అవాంతరాలను మీరు అధిగమిస్తారు. తెలుపు, ఎరుపు రంగులు మీకు అనుకూలిస్తాయి.
Also Read :Jimmy Carter : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. ఆయన లైఫ్‌లోని కీలక ఘట్టాలివీ
సింహ రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో సింహరాశికి చెందిన ఉద్యోగులపై పనిఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సమస్యలు కూడా దూరమవుతాయి. మీకు ఎదురయ్యే సమస్యల్ని బుద్ధి బలంతో గెలవాలి. ఇతరులతో వాదనకు దిగొద్దు. మౌనంగా ఉంటే బెటర్. ప్రయాణించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఎరుపు, నేరేడు రంగులు మీకు అనుకూలిస్తాయి.
కన్య రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో కన్యరాశి వారికి ఆస్తుల వివాదాలు సాల్వ్ అవుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారమై మీరు రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతారు. మీరు ఆత్మ సమీక్ష చేసుకోండి. ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు వారాంతంలో శుభం జరుగుతుంది. వ్యాపారాలు కలిసొస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు మీకు అనుకూలిస్తాయి.
తుల రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో తులరాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ఖర్చులను సాధ్యమైనంత మేర తగ్గించుకోండి. ఆత్మీయులతో మాట పట్టింపులకు పోవద్దు. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పసుపు, నేరేడు రంగులు మీకు అనుకూలిస్తాయి. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక రుణబాధలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురవుతున్న సమస్యలు దూరం అవుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యల ముప్పు ఉంది. కుటుంబంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. గులాబీ, లేత ఎరుపు రంగులు మీకు అనుకూలిస్తాయి. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సాల్వ్ అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అలసత్వాన్ని వీడండి. ఏ పనిలోనూ ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శించకండి.
ధనుస్సు రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో ధనుస్సు రాశి వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇతరులపై ఆధారపడటం మానేయండి. చెడు స్నేహాలను వదిలేయండి. వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అనవసర ప్రయాణాలు చేయకుంటేనే బెటర్. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల ముప్పు ఉంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు మీకు అనుకూలిస్తాయి.
మకర రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో మకర రాశివారికి స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు విధుల్లో పొరపాట్లు సరిదిద్దుకునే ఛాన్స్ దక్కుతుంది. దూర ప్రయాణాలు మానుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్య సమస్యల ముప్పు ఉంది. ఆప్తుల సలహాలు తీసుకున్నా..తుది నిర్ణయం సొంతంగా చేయండి. నలుపు, నేరేడు రంగులు మీకు అనుకూలిస్తాయి. వ్యాపారం, ఉద్యోగంలో ఏదైనా మంచి ఛాన్స్ వస్తే దాన్ని వదులుకోవద్దు.
కుంభ రాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో కుంభరాశివారు అప్పులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఆర్థిక నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. వ్యాపార విస్తరణకు ఇది మంచి టైం. కుటుంబ సభ్యులతో మానసిక అశాంతి ఎదురుకావచ్చు. ఆకుపచ్చ, పసుపు రంగులు మీకు అనుకూలిస్తాయి. మీకు గృహ, వాహన యోగాలు ఉన్నాయి. ఓర్పుతో నిర్ణయాలు తీసుకోండి. ఓ ఆపద నుంచి మీరు బయటపడతారు.
మీనరాశి
కొత్త సంవత్సరం మొదటి వారంలో మీనరాశి వారు అత్యంత నేర్పుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని వదలొద్దు. ఉద్యోగాలు చేసేవారికి వివాదాలు ఎదురవుతాయి. ఇతరుల మనసు నొప్పించే మీ మాటలు కానీ.. నిర్ణయాలు కానీ ఉండకుండా చూసుకోండి. మీ వ్యాపారాలకు ఊహించని పెట్టుబడులు లభిస్తాయి. రాజకీయవేత్తలకు పదవీయోగం ఉంది.పసుపు, ఎరుపు రంగులు మీకు అనుకూలిస్తాయి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.