Lord Shiva : 3 సంఖ్యతో శివ భగవానుడికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఆ సంఖ్య చాలా శుభప్రదమైనదని అంటారు. ఇంతకీ 3 సంఖ్యకు.. శివ భగవానుడికి(Lord Shiva) ఉన్న అనుబంధం ఏమిటి ? మహా దేవుడి ఏయే అంశాల్లో 3 అంకె మనకు పరోక్షంగా తారసపడుతుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
త్రినేత్రం
శివుడు త్రినేత్రుడు. ఆయనకు 3 నేత్రాలు ఉంటాయి. భూమిపై పాపాలు పెరిగిపోయినప్పుడు శివుడు తన మూడో కన్నును తెరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. శివుడు మూడో కన్నును తెరవగానే మహా ప్రళయం వచ్చి సమస్త భూమండలం లయం అవుతుందని చెబుతారు.
త్రిశూలం
శివుడి చేతిలో నిత్యం ఉండే ఆయుధం త్రిశూలం. ఇందులోని మూడు అంచులు.. ఆకాశం, భూమి, పాతాళానికి ప్రతీకలు అని చెబుతుంటారు.
త్రిపుండ్రాలు
త్రిపుండ్రాలు అంటే మహాశివుడి నుదుటిపై విభూతితో ఉండే మూడు గీతలు. వీటిని దర్శిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, అభివృద్ధి లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
Also Read :Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు
త్రిపురారి
శివ పురాణం ప్రకారం.. పూర్వం ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను నిర్మించుకొని ప్రజలను ఇబ్బందిపెట్టారు. రాక్షసులు ఈ నగరాలకు త్రిపుర అని పేరు పెట్టారు. ఈ మూడు నగరాలు ఎప్పుడూ గాలిలో ఎగురుతూనే ఉండేవి. రాక్షసులు భూమిపై భీభత్సం సృష్టించి వచ్చి ఈ త్రిపుర నగరాల్లో దాక్కునేవారు. ఈ రాక్షసుల కారణంగా దేవతలు కూడా ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది. రాక్షసులతో వేగలేక దేవతలు, మానవులు కలిసి శివుడిని ఆశ్రయించారు. దీంతో మహేశ్వరుడు రాక్షసులతో యుద్ధం చేశాడు. భూమిని రథంగా చేసుకొని.. సూర్యచంద్రులను రథానికి చక్రాలుగా మార్చుకున్నాడు. ఆదిశేషుడిని విల్లుగా, శ్రీ మహావిష్ణువును ధనుస్సుగా చేసుకున్నాడు. ఈ రథంతో మంధర పర్వతాన్ని ఎక్కిన పరమేశ్వరుడు.. ఒక రోజు మూడు నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చిన టైంలో బాణం వేసి మూడు నగరాలను, రాక్షసులను సంహరించాడు.
ఏకబిల్వం శివార్పణమ్
శివుడికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం. మారేడు దళంలో మూడు ఆకులు(Number 3) ఉంటాయి. మారేడు దళాల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకొని ఉంటుందని అంటారు.
Also Read :Bunker in Wardrobe : అల్మారాలో ఉగ్రవాదుల రహస్య బంకర్.. వీడియో వైరల్
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.