Site icon HashtagU Telugu

Married Women : పెళ్లైన మహిళలు ఇతరులకు చెప్పకూడని విషయాలు ఇవే, ఒక వేళ చెప్పారో, మీ భర్త ప్రాణాలకు ప్రమాదమే…!!

Married Women

Married Women

పెళ్లి తర్వాత స్త్రీలకు కొత్త బంధాలు ఏర్పడతాయి. అత్త, మామ, ఆడపడుచులు,తోటికోడళ్లు మొదలైన వారితో సంబంధాలు ఏర్పడతాయి. వారితో నవవధువు వారితో కలిసిపోవాలి. అయితే పెళ్లైన స్త్రీ మరొక వివాహితతో పంచుకోకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. కొత్తగా పెళ్లైన స్త్రీ మరో మహిళతో కొన్ని విషయాలను పంచుకున్నట్లయితే భర్తతో సంబంధం చెడిపోతుంది. కాబట్టి పెళ్లయిన స్త్రీ మరో స్త్రీతో ఎలాంటి విషయాలు పంచుకోకూడదో తెలుసుకుందాం.

సింధూరం:
సింధూరం సుమంగళి స్త్రీలకు ప్రతీక. కానీ సింధూరం బాక్స్‌ను మరే ఇతర మహిళతో పంచుకోకూడదు. మీరు ఎప్పుడూ మీ స్వంత సింధూరాన్నే ధరించాలి. వేరొకరు ఉపయోగించిన సింధూరాన్ని పెట్టుకోకూడదు. మరోవైపు, కొంగును తలపై ఉంచుకుని మాత్రమే సింధూరాన్ని నుదుట పెట్టుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

కాటుక:
సాధారణంగా మహిళలు కాటుకను ఇతరులది కూడా వాడుతుంటారు. అలా చేస్తే భర్తపై ప్రేమ తగ్గిపోతుంది. కాబట్టి ఇతరులు వాడిన కాటుకను ఎట్టిపరిస్ధితుల్లోనూ వాడకూడదు.

మెహందీ:
చాలా మంది మహిళలు ఇంట్లో తమ చేతులకు మెహందీని పెట్టుకుంటారు. కానీ మీరు వాడిన మెహందీని వేరే స్త్రీకి పెట్టడం వల్ల మీ భర్తకు మీ పట్ల ప్రేమ తగ్గుతుంది.

కంకణాలు:
ఏ ఇతర స్త్రీకి సంబంధించిన కంకణాలు, కాళ్లపట్టీలను వాడకూడదు.

Exit mobile version