Monsoon Herald : మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది. ఈ ఆలయాల్లోని దేవతల మహిమపై భక్తులకు అపార విశ్వాసం ఉంటుంది. అందుకే మొక్కులు మొక్కుకుంటారు. మొక్కులు తీరాక, ముడుపులను చెల్లించుకుంటారు. ఈ కోవలోకే ఒక ఆలయం వస్తుంది. ఇది రుతుపవనాల రాకను ముందేే గుర్తించగలదు. వివరాలివీ..
రుతుపవనాల రాకను గుర్తించే ఆలయం విశేషాలివీ..
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరం సమీపంలో బెహతా అనే గ్రామం ఉంది.
- బెహతా గ్రామంలోనే జగన్నాథ ఆలయం(Monsoon Herald) ఉంది. ఇది ప్రాచీన కోవెల.
- ఈ ఆలయంలో జగన్నాథుడు కొలువై ఉన్నాడు.
- ఈ ఆలయం దాదాపు 4వేల సంవత్సరాలు పాతదని చెబుతుంటారు.
- రుతు పవనాలు ఎప్పుడు వస్తాయి అనేది ముందే ఈ ఆలయం గుర్తించగలదు. కచ్చితమైన అంచనాలను వెలువరించగలదు.
- ఈ ఆలయానికి మాన్‌సూన్ టెంపుల్ అనే పేరొచ్చింది. కొంతమంది మాన్‌సూన్ జగన్నాథ ఆలయం అని పిలుస్తారు.
- రుతుపవనాలను ముందే గుర్తించేలా బెహతా గ్రామంలోని జగన్నాథ ఆలయంలో వందల, వేల ఏళ్ల కిందటి ఇంజినీరింగ్ వ్యవస్థ ఉందట. అయితే దీన్ని ఇప్పటికీ ఎవరూ క్లియర్‌గా అర్థం చేసుకోలేకపోయారు.
- ఈ ఆలయాన్ని ముందు భాగం నుంచి చూస్తే పూర్తి గోపురంలా కనిపిస్తుంది.
- ఈ ఆలయ గోపురంలోని రాయి తడిసిపోయి, ఆలయం లోపలి భాగంలో నీరు పడటం మెుదలైతే రుతుపవనాలు వస్తున్నాయని అర్థం చేసుకోవాలట. ఒకవేళ నీటి చుక్కలు తక్కువగా పడితే.. అది సాధారణ వర్షానికి సంకేతమట. ఎక్కువగా నీటి చుక్కలు పడితే మంచి వర్షం పడుతుందని సూచనగా పరిగణించాలట.
- ఈ ఆలయం చెప్పే రుతుపవనాల అంచనాను ఇరుగుపొరుగు గ్రామాల రైతులు ఏటా విత్తనాలు వేస్తుంటారు.
- ఈసారి (2025లో) ఆలయం పైకప్పు నుంచి ఎక్కువ మొత్తంలో నీటి చుక్కలు పడ్డాయి. దీంతో రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఈసారి వర్షపాతం చాలా బాగుంటుందని ఆలయం పూజారి చెప్పుకొచ్చారు.
- వర్షం మెుదలైన వెంటనే ఈ ఆలయంలో పైకప్పు లోపలి భాగం ఎండిపోతుంది.
- పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఎన్నోసార్లు ఈ ఆలయానికి వచ్చి పరిశోధనలు చేశారు.