Shubh Muhurat : ఫిబ్రవరిలో శుభకార్యాలు, కొత్త పనులకు శుభవేళలివే..

Shubh Muhurat : ఫిబ్రవరి నెలలోనూ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.

  • Written By:
  • Updated On - January 27, 2024 / 12:47 PM IST

Shubh Muhurat : ఫిబ్రవరి నెలలోనూ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహం, గృహప్రవేశం, ముండనం, పవిత్ర దారం, కొత్త దుకాణం ప్రారంభోత్సవాలకు మంచి ఘడియలు ఉన్నాయి. వచ్చే నెలలో వివాహానికి 11 రోజులు, గృహప్రవేశానికి 5 రోజులు, ముండనానికి 3 రోజులు, పవిత్రమైన దారం ధరించడానికి 5 రోజులు, కొత్త దుకాణం తెరవడానికి 4 రోజులు శుభముహూర్తాలతో సిద్ధంగా ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

వివాహాలు, శుభ తేదీలు 

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శుభతేదీల వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఫిబ్రవరి 4, మంగళవారం ఫిబ్రవరి 6, బుధవారం ఫిబ్రవరి 7, గురువారం ఫిబ్రవరి 8, సోమవారం ఫిబ్రవరి 12, మంగళవారం ఫిబ్రవరి 13, శనివారం ఫిబ్రవరి 17, శనివారం ఫిబ్రవరి 24, ఆదివారం ఫిబ్రవరి 25, సోమవారం ఫిబ్రవరి 26, గురువారం ఫిబ్రవరి 29 తేదీల్లో వివాహాలకు మంచి శుభ ముహూర్తాలు ఉన్నాయి.

గృహ ప్రవేశాలు, శుభ తేదీలు

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శుభతేదీల వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 12 సోమవారం (ముహూర్తం  14:56 నుంచి 17:44 వరకు) ఫిబ్రవరి 14 బుధవారం (ముహూర్తం  07:01 నుంచి 10:43 వరకు), ఫిబ్రవరి 19 సోమవారం (ముహూర్తం 06:57 నుంచి 10:33 వరకు), ఫిబ్రవరి 26 సోమవారం (ముహూర్తం  06:50 నుంచి 28:31), ఫిబ్రవరి 28 బుధవారం ముహూర్తం (28:18 నుంచి 30:4 వరకు) తేదీల్లో గృహ ప్రవేశాలకు మంచి ముహూర్తాలు  ఉన్నాయి.

Also Read :Dharani Vs Bhumata : భూమాత పోర్టల్‌లో ఆ కాలమ్ ఉంటుందా ? కొత్త మార్పులేంటి ?

కొత్త వ్యాపారాల ప్రారంభం, శుభ తేదీలు

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శుభతేదీల వివరాల్లోకి వెళితే..  ఫిబ్రవరి 4 ఆదివారం, ఫిబ్రవరి 12 సోమవారం, ఫిబ్రవరి 15 గురువారం, ఫిబ్రవరి 22 గురువారం తేదీలలోని ముహూర్తాలలో కొత్త షాపులను తెరుచుకోవచ్చు.

శిరో ముండనం, శుభ తేదీలు

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శుభతేదీల వివరాల్లోకి వెళితే..   ఫిబ్రవరి 21 బుధవారం ముహూర్తం ఉదయం 11:30 నుంచి రోజంతా,  ఫిబ్రవరి 22 గురువారం (ముహూర్తం  సాయంత్రం 06:54 నుంచి 01:24 వరకు), ఫిబ్రవరి 29 గురువారం (ముహూర్తం  ఉదయం 06:46 నుంచి రోజంతా) తేదీల్లో  ఉన్న ముహూర్తాల్లో శిరో ముండనం చేయించుకోవచ్చు.

Also Read : Ram Charan: కొడుకుగా గర్విస్తున్నా, చిరంజీవికి పద్మవిభూషణ్ పట్ల రామ్ చరణ్ ఎమోషనల్

జంద్యం ధారణ, శుభ తేదీలు

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శుభతేదీల వివరాల్లోకి వెళితే..   ఫిబ్రవరి 11 ఆదివారం (ముహూర్తం  17:39 నుంచి రాత్రి వరకు), ఫిబ్రవరి 12 సోమవారం (ముహూర్తం  07:03 నుంచి 14:56 వరకు), ఫిబ్రవరి 14 బుధవారం (ముహూర్తం  11:31 నుంచి 12:10 వరకు), ఫిబ్రవరి 19 సోమవారం (ముహూర్తం  06:57 నుంచి 21:20 వరకు), ఫిబ్రవరి 29 గురువారం (ముహూర్తం 06:47 నుంచి 10:22 వరకు)  సందర్భంగా జంద్యం ధారణకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.

Also Read :Niharika Ex-Husband : నిహారిక డివోర్స్ ఇంటర్వ్యూపై మాజీ భర్త స్ట్రాంగ్ కౌంటర్.. జాగ్రత్త అంటూ?