Arudra Nakshatra : ఆరుద్రా నక్షత్రం.. శివుడికి అత్యంత ప్రీతకరమైనది. శివుడికి రుద్రుడు అనే పేరు కూడా ఉంది. శివుడికి ఇష్టమైనది కావడం వల్ల దీనికి ఆరుద్రా నక్షత్రం(Arudra Nakshatra) అనే పేరు వచ్చింది. ఆరుద్రా నక్షత్రంలో శివుడు జన్మించారని.. అది శివుని నక్షత్రమని అంటారు. అందుకే ఆరుద్రా నక్షత్రం ఉన్న సమయంలో శివారాధన చేయాలని పండితులు చెబుతారు. ఈనేపథ్యంలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
- ఆరుద్ర నక్షత్రంలో(Ardra Nakshatra) జన్మించిన వారి అదృష్ట సంఖ్య 2, 4, 7, 9.
- ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి ఎరుపు, ఊదా లక్కీ కలర్స్.
- ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి మంగళ, గురువారాలు లక్కీ డేస్.
- ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు రాజకీయ రంగం, ఇంజనీరింగ్ రంగం, వీడియో గేమ్ డెవలపర్లు, సైకియాట్రిస్ట్‌లు, సైన్స్ , ఫిక్షన్ రైటింగ్ రంగాలలోకి వెళ్లొచ్చు.
- ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన పురుషులకు వివాహం ఆలస్యం అవుతుంది. 27 ఏళ్లలోగా పెళ్లయినా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
Also Read :LIC Jobs : ఎల్‌ఐసీలో 200 జాబ్స్.. ఏపీ, తెలంగాణలోనూ పోస్టులు
- ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు 34 ఏళ్ల తర్వాత నయం కాని వ్యాధుల బారిన పడొచ్చు.
- ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు శాంతియుతంగా ఉంటారు. అనవసర వాదనలకు ఇష్టపడరు. భర్తతో అనుకూలతను కలిగి ఉంటారు.
- ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వైద్య, వైజ్ఞానిక రంగాల్లో రాణిస్తారు.
- ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు అగ్నిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
- ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ, పురుషులు బయటకు కఠినంగా ఉన్నప్పటికీ లోపల దయగలవారు.
- ఎదుటి వారి మనసులో ఏముందో వీరు సులువుగా గుర్తించగలరు.
- ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఉద్యోగాలలో ఓ వెలుగు వెలుగుతారు.
- తప్పుడు సలహాలు ఇవ్వడం, పగతీర్చుకోవాలనే ఆలోచన, మొండిపట్టుదల వల్ల వీరి జీవితంలోకి కష్టాలు వస్తాయి.
- ఆరుద్ర నక్షత్రం వాళ్లు ఎక్కువగా రాత్రి టైంలో జీవిత నిర్ణయాలు తీసుకుంటారని పండితులు చెబుతుంటారు.
Also Read :August Horoscope : ఆగస్టు నెల రాశి ఫలాలు.. ఆ రాశి వారికి శత్రుగండం
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.