Astro Tips: లవంగంతో ఇలా చేసి చూడండి…మీ కష్టాలన్నీ తొలగిపోతాయి…!!

పన్నునొప్పితో బాధపడుతుంటే..లవంగాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. నోట్లో లవంగం పెట్టుకుంటే పన్ను నొప్పి బాధనుంచి తేరుకోవచ్చు. డిటాక్స్ కోసం లవంగం నీరు తాగడం గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 14, 2022 / 02:37 PM IST

పన్నునొప్పితో బాధపడుతుంటే..లవంగాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. నోట్లో లవంగం పెట్టుకుంటే పన్ను నొప్పి బాధనుంచి తేరుకోవచ్చు. డిటాక్స్ కోసం లవంగం నీరు తాగడం గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. నోరు తాజాగా ఉండేందుకు కూడా లవంగం వాడుతుంటారు. దగ్గు తగ్గేందుకు కూడా వాడుతుంటారు. భారతీయ వంటకాల్లో లవంగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. లవంగం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు..జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా లవంగం కీలక పాత్ పోషిస్తుందట. ఎలాగో తెలుసుకుందాం.

జీవితంలో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు

మీ డబ్బు ఎవరిదగ్గరైనా చిక్కుకుపోయినట్లయితే…మీ డబ్బు మీకు తిరిగి రావడం లేదంటే..లవంగాలతో డబ్బు సంపాదించవచ్చు. ఎలాగంటే మీరు చేయాల్సింది 11 లేదా 12 లంవగాలను కర్పూరంతో కలిపి అమావాస్య లేదా పౌర్ణమి రాత్రి కాల్చండి. అప్పుడు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. ఇలా చేస్తే ఇరుక్కుపోయిన డబ్బు వస్తుంది. ధనం పోగుపడేందుకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే…
ఇంటర్వ్యూ కోసం లేదా మరేదైనా పెట్టుబడి చర్చల కోసం వెళ్తున్నట్లయితే…ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు లవంగాలను నోట్లో పెట్టుకోండి. మీరు వదిలిపెట్టిన కార్యాలయ స్థలంలో ఆవిరి చేయండి. ఇలా చేస్తే మీకు విజయం దక్కుతుంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూను విజయవంతం చేస్తుంది.

చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైతే…
ఏదైనా పని ఎన్నిసార్లు చేసినా జరగడం లేదా. అయితే మంగళవారాల్లో ఆంజనేయ విగ్రహానికి నూనె దీపం వెలిగించండి. ఆ దీపంలో రెండు లవంగాలు వేయండి. హనుమాన్ చాలీసా చదవడం అసలు మర్చిపోవద్దు. హనుమంతుని భక్తితో మీ పని విజయవంతం కావాలని ప్రార్ధించండి. నిరంతరాయంగా 21 మంగళవారాలు ఇలా చేస్తే మీ పని ఫలిస్తుంది.

లక్ష్మీదేవి ధనాన్ని ప్రసాదించాలంటే…
ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే లక్ష్మీదేవికి ప్రతిరోజూ గులాబీ పువ్వుల గుత్తితోపాటు రెండు లవంగా ఇవ్వండి. ప్రతిరోజూ కాకపోయినా కనీసం శుక్రవారమైనా చేయండి. ఇలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే శనివారం నాడు నూనెతో నాలుగు లవంగాలు కాల్చండి. ఇంట్లో చీకటి మూలలో ఉంచండి. దీంతో ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మెల్లగా తొలగిపోతుంది. ఇంట్లో అన్ని పనులతో వచ్చే మార్పు మీరే చూడండి.