Tirumala Brahmotsavam: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల దివ్యక్షేత్రంలో అక్టోబరు 4 నుంచి జరుగుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam) నేటితో ముగిశాయి. ఇవాళ విజయదశమి రోజున చక్రస్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు తెరపడింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగుస్తున్నాయి. విజయవంతంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. 15 లక్షల మంది వాహాన సేవల్లో పాల్గొన్నారు. 3 లక్షల మంది భక్తులు గరుడ సేవ రోజు స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లపై శ్రీవారి భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయాలతో టీటీడీ ఫీడ్ బ్యాక్ తయారు చేశామని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. సూక్ష్మ ప్రణాళిక తయారు చేసి సీఎం చంద్రబాబుకు చూపించాం. సీఎం కొన్ని సలహాలు ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం వాహాన సేవలో దర్శనంతో పాటు మూల మూర్తి దర్శనం, భక్తులకు మంచి అతిథ్యం ఇవ్వడం, మర్యాదతో వ్యవహారించడం లాంటివి ప్లానింగ్‌లో పెట్టాం. సిబ్బందిని ఎక్కువ మందిని తీసుకున్నాం. టీటీడీ సిబ్బంది, విజిలెన్స్, పోలీసులు, శ్రీవారి సేవకులు 24 గంటలు పనిచేశారన్నారు.
Also Read: Vajramushti Kalaga : రక్తం చిందే దాకా కుస్తీ.. హోరాహోరీగా ‘వజ్రముష్టి కళగ’ పోటీలు
గత ఏడాది 16లక్షలు.. ఈసారి 26 లక్షల మంది అన్నప్రసాదము తీసుకున్నారని తెలిపారు. అల్పహారం గత ఏడాది యాభవై వేలు చేయిస్తే, ఈ ఏడాడి 1,90,000 మందికి చేయించాం. నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం. గరుడ వాహానం, చక్రస్నానము నాడు గ్యాలరీలలో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం. శ్రీవారి నైవేద్యాలు గతేడాది 2లక్షలు ఇస్తే ఈసారి 3 లక్షల 90 వేలు ఇచ్చాం. భక్తులు నైవేద్యాల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో నాణ్యత లేని బియ్యం, బెల్లం, నెయ్యి వచ్చేది. వాటిని రద్దు చేయడంతో నాణ్యమైన నైవేద్యం పెడుతున్నామన్నారు. గడిచిన వారం రోజుల్లో శ్రీవారి మూల మూర్తిని 6.5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గతేడాది 5 లక్షల మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 8 రోజులకు గాను 28కోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.