Weekly Horoscope : ఈవారం రాశి ఫలితాలు.. ఆగస్టు 6 నుంచి 12 వరకు వార ఫలాలు

Weekly Horoscope : ఈవారం మేషరాశి వారు  అనవసర భయానికి లోనవుతారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. అనారోగ్య బాధలు పెరుగుతాయి. అకారణంగా గొడవలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 07:29 AM IST

Weekly Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం (ఆగస్టు 6 నుంచి 12 వరకు)   రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈవారం మేషరాశి వారు  అనవసర భయానికి లోనవుతారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. అనారోగ్య బాధలు పెరుగుతాయి. అకారణంగా గొడవలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా విఘ్నాలు ఎదురవుతాయి. ఒకోసారి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. దక్షిణామూర్తిని పూజించాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.

వృషభ రాశి

ఈవారం వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి.  ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆవేశం పనికిరాదు.  నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

మిథునం

ఈవారం మిథునరాశి వారికి  ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు. పిల్లల పట్ల అశ్రద్ధ పనికిరాదు. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. సంకోచం పనికిరాదు. కుటుంబసభ్యుల సూచనలు సత్ఫలితాన్నిస్తాయి. వీకెండ్ లో మంచి వార్తలు వింటారు. ఆదివారం సూర్యాష్ట్రకాన్ని పఠించండి.

కర్కాటకం

ఈవారం కర్కాటక రాశి వారికి ఆకస్మిక కలహాలు గోచరిస్తున్నాయి. ధననష్టాన్ని అధిగమించుటకు రుణ  ప్రయత్నం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల వలన లాభం ఉంది.  బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారబలం పెరుగుతుంది. ఒంటరిగా ఉండవద్దు.  శివారాధన శ్రేయస్సును ఇస్తుంది.

సింహం

ఈవారం సింహరాశి వారు ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. ఆరోగ్యం మెరువగువుతుంది. బంధు మిత్రులతో కలుస్తారు. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. బుణబాధలు తొలగుతాయి. దేనికీ తొందర పడవద్దు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి.

Also read : Bitter Gourd : కాకరకాయ చేదు తగ్గడానికి ఈ చిట్కాలు మీకు తెలుసా?

కన్య(Weekly Horoscope)

ఈవారం కన్యా రాశి వారికి స్త్రీల నుంచి సహకారం లభిస్తుంది. విదేశీయాన ప్రయాణాలు ఆలస్యంగా ఫలిస్తాయి. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పక్కదోవ పట్టించే వారున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తుల

ఈవారం తులారాశి వారు శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

వృశ్చికం

ఈవారం  వృశ్చిక రాశి వారికి కుటుంబంలో మనశ్శాంతి కరువవుతుంది. బంధు మిత్రులతో వైరం చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించడం మంచిది. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. రహస్య శత్రు బాధలు ఉంటాయి. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. కాలం వ్యతిరేకంగా ఉంది. కాలానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. మనోబలంతో పనులు పూర్తిచేయాలి. లక్ష్మీ అష్టకం పఠించండి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.

ధనుస్సు

ఈ వారం ధనూరాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. శారీరకంగా బలహీనత కనిపిస్తోంది. భూ గృహ వాహనాది యోగాలలో కలిసి వస్తుంది. నిర్ణయాలలో కాలయాపన ఉండకూడదు. ఈ వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. సూర్యాష్టకాన్ని పఠించండి.

Also read : Sita Ramam : సీతారామం సినిమాలో మృణాల్, రష్మిక పాత్రలు.. అసలు ఆ హీరోయిన్స్ చేయాల్సింది.. ఎవరో తెలుసా..?

మకరం

ఈ వారం మకర రాశి వారికి ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. వృథా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు. అంతా మన మంచికే అన్న ధోరణిలో ముందుకు వెళ్ళండి. మంచి తనం కాపాడుతుంది. నవగ్రహశ్లోకాలు చదువుకోవడం ఉత్తమం.

కుంభం

ఈ వారం కుంభ రాశి వారి పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తుల జోలికి వెళ్ళరాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. సోమరితనం ఆవహిస్తుంది. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. బంధుమిత్రులతో గొడవలకు దూరంగా ఉండండి. ఆవేశపడకుండా ఆశయాలను సాధించాలి. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి.

మీనం 

ఈ వారం  మీన రాశి వారు ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. వారి రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. శుభకార్య ప్రయతాలు ఫలిస్తాయి. బ్రహ్మాండమైన వ్యాపారయోగం సూచనలు ఉన్నాయి. కొన్ని సమస్యలు తొలగుతాయి.  నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.