Site icon HashtagU Telugu

Maha Kumbh: సనాతన ధర్మంలోకి 200 మంది ఫారినర్లు.. మహాకుంభ మేళాలో ఆధ్యాత్మిక శోభ

Foreigners Into Sanatan Dharma Maha Kumbh Prayagraj Uttar Pradesh 2025

Maha Kumbh: విదేశీయులూ సనాతన ధర్మంలోకి ప్రవేశిస్తున్నారు. విదేశీ కల్చర్ అనేది అడ్డదిడ్డంగా తయారైంది. ఎంతోమంది విదేశీయులు బిజీలైఫ్‌ ఉచ్చులో పడి, సంపాదన రేసులో మునిగిపోయి మానసిక సుఖానికి దూరం అవుతున్నారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వివిధ వ్యసనాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈక్రమంలో ఎంతోమంది విదేశీయులు వివిధ మతాల గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి అధ్యయనం చేసిన ఎంతో ఫారినర్లు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా సాక్షిగా సనాతన ధర్మంలోకి ప్రవేశించారు. వివరాలివీ..

Also Read :Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?

జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ఎవరు ?

మారిషస్‌ దేశానికి చెందిన జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి గత కొన్ని దశాబ్దాలుగా హిందూ మత ప్రచారం చేస్తున్నారు. మహాకుంభ మేళా వేళ  ప్రయాగ్ రాజ్‌లో ఉన్న కుంభ్ నగర్ సెక్టార్ 17లో ఉన్న శక్తిధామ్ ఆశ్రమంలో జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ఉన్నారు. ఈసారి కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 200 మందికిపైగా విదేశీయులు ఆమె సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించారు.తాజాగా బుధవారం ఒక్కరోజే 61 మంది విదేశీయులు జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ద్వారా వేదమంత్రాలు చదివి సనాతన ధర్మంలోకి ప్రవేశించారు.  జగద్గురు సాయి మా లక్ష్మీ దేవికి జపాన్, అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ సహా 12కుపైగా దేశాల్లో శిష్యులు ఉన్నారు. వారంతా ఆమె బోధనలతో ప్రభావితమై సనాతన ధర్మంలోకి వచ్చిన వారే.

Also Read :Fire Accident : జగన్ ప్లాన్ లో భాగమే ఈ అగ్ని ప్రమాదమా..?

జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి ద్వారా సనాతన ధర్మాన్ని స్వీకరించిన విదేశీయుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయితే, ఇంకొందరు డాక్టర్లు, మరికొందరు మార్కెటింగ్ నిపుణులు. వీరంతా ఉన్నత విద్యావంతులే. హిందూయిజం గురించి బాగా రీసెర్చ్ చేశాకే మహాకుంభ మేళా(Maha Kumbh)కు వచ్చి, సనాతన ధర్మాన్ని స్వీకరించామని ఆ ఫారినర్లు చెబుతున్నారు. సనాతన ధర్మం స్వీకరించిన వారిలో.. ఎముకల వ్యాధి నిపుణురాలు కేథరీన్ గిల్డెమిన్(బెల్జియం), అమ్మకాలు, మార్కెటింగ్ నిపుణుడు డేవిడ్ హారింగ్టన్(ఐర్లాండ్‌‌),  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఆలివర్ గియులిరీ(ఫ్రాన్స్‌‌), ఆర్కిటెక్ట్ మ్యాథ్యూ లారెన్స్(అమెరికా), వైద్యుడు ఆండ్రీ అనత్( కెనడా), ఇంధన రంగ నిపుణుడు జెన్నీ మిల్లర్ (అమెరికా), ఐటీ డెవలపర్ మాథ్యూ సావోయ్(కెనడా), ఆరోగ్య భద్రతా సలహాదారు క్రిస్టెల్ డి కాట్(బెల్జియం) తదితరులు ఉన్నారు.