Shobhan Babu : హీరో శోభన్ బాబు అలనాటి స్టార్ హీరో. ఆయన 1937 జనవరి 14న కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాక శోభన్ బాబు తమిళనాడు రాజధాని చెన్నైలో సెటిల్ అయ్యారు. 2008 సంవత్సరం మార్చి 20న ఆయన చెన్నైలోనే తుదిశ్వాస విడిచారు. శోభన్ బాబుకు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. అయితే వారెవరినీ సినీరంగం దిశగా ఎంకరేజ్ చేయలేదు. వ్యాపారాలు, విద్యారంగం, వివిధ ప్రొఫెషన్స్ దిశగా తన వారసులను ఆయన ప్రోత్సహించారు. ఇప్పుడు శోభన్ బాబు మనవడు సురక్షిత్ బత్తిన గొప్ప డాక్టర్‌గా ఇరగదీస్తున్నాడు. ఒకప్పుడు తాత శోభన్ బాబు యాక్టర్‌గా మెరుపులు మెరిపించగా.. ఇప్పుడు డాక్టర్ సురక్షిత్ అరుదైన, సంక్లిష్టమైన సర్జరీలు చేస్తూ గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నాడు.
Also Read :Indian Army: లోయలో పడిన మరో ఆర్మీ వాహనం.. మృత్యులోయల డేంజర్ బెల్స్
శోభన్‌బాబు మనవడు సురక్షిత్ గురించి..
- రోగులు త్వరగా కోలుకునేలా చెన్నైలో తొలిసారిగా ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్ వ్యవస్థను డాక్టర్ సురక్షిత్ బత్తిని(Shobhan Babu) తీసుకొచ్చారు.
- 2016లో చెన్నైలోని అన్నానగర్‌లో ఇండిగో ఉమెన్స్ సెంటర్‌ను ఆయన స్థాపించారు. అప్పటి నుంచి పలు రికార్డు ఆపరేషన్లు నిర్వహించారు.
- ఇప్పటివరకు సురక్షిత్ 10వేలకు మించిన శస్త్రచికిత్సలు చేశారు.
- తన తండ్రి డాక్టర్ శరత్ బత్తిన నుంచి సంతానోత్పత్తిలో, గురువు రాకేశ్ సిన్హా నుంచి ల్యాప్రోస్కోపీ సర్జరీలో, అమెరికాలోని డాక్టర్ అలెగ్జాండర్ బాడర్ నుంచి కాస్మొటిక్ గైనకాలజీలో వైద్యనైపుణ్యాలను డాక్టర్ సురక్షిత్ నేర్చుకున్నారు.
- 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో 4.5 కిలోల భారీ కణితి (ఫైబ్రాయిడ్) ఉండటంతో దాన్ని ఓపెన్ సర్జరీ ద్వారా కాకుండా 3డీ ల్యాపరోస్కోపీ ద్వారా డాక్టర్ సురక్షిత్ తొలగించారు. ఈ సర్జరీ 8 గంటల పాటు జరిగింది. ఇందుకుగానూ ఆయన పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ప్రతిపాదించారు.
- ఓ మహిళ రెండోసారి గర్భం దాల్చాక ఆరు నెలలు నిండిన తర్వాత గర్భాశయం పగిలింది. దీంతో పిండం పొట్టలోకి జారిపోయింది. సహజంగానైతే గర్భసంచిని, పిండాన్ని తీసేసి ఆమె ప్రాణాలను కాపాడుతారు. అయితే సదరు మహిళ బిడ్డను కోరుకుంది. దీంతో ల్యాపరోస్కోపీ ద్వారా పొట్టలోని జారిన పిండాన్ని తీసి గర్భసంచిలో ఉంచి డాక్టర్ సురక్షిత్ సర్జరీ చేశారు. ఆమె రెండోకాన్పు ప్రశాంతంగా జరిగింది.
- డాక్టర్ సురక్షిత్ 2023లో టెడ్‌ఎక్స్ స్పీకర్‌గా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
- ఆయనకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా dr_baby_maker ఖాతాకు 1.67లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
- ఇప్పటి వరకు సురక్షిత్‌కు 40కిపైగా అవార్డులు, సర్టిఫికెట్లు వచ్చాయి.
- నిబద్ధత, నిజాయితీ విషయంలో అచ్చం తాతయ్య శోభన్‌బాబులాగే సురక్షిత్ వ్యవహరిస్తాడని, ఆయన తల్లి మృదుల తెలిపారు.
- తాత శోభన్ బాబు పేరిట వారాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను సురక్షిత్ నిర్వహిస్తున్నారు.
- డాక్టర్ సురక్షిత భార్య శ్రీలత కూడా డాక్టరే కావడం విశేషం.