Site icon HashtagU Telugu

Radhika Apte: ప్రైవేట్ పార్ట్స్ పై రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్

Radhika Apte

Radhika Apte

బోల్డ్ బాలీవుడ్ బ్యూటీ రాధికా (Radhika Apte) ఆప్టే ఛాలెంజింగ్ రోల్స్‌తో పేరు తెచ్చుకుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బోల్డ్ సీక్వెన్స్‌లలో నటించడానికి ఆమెకు అభ్యంతరం లేదు. దీంతో ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. రాధికా ఆప్టే తెలుగు తెరపై ‘లయన్’, ‘లెజెండ్’, ‘ధోని’ వంటి చిత్రాలతో మెరిసింది. ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో రాధిక చివరిసారిగా కనిపించింది.

తాజా ఇంటర్వ్యూలో.. నటి తన బ్రెస్ట్ (Breasts) సైజ్ గురించి మాట్లాడింది. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి మాట్లాడారు. ‘‘మొదట్లో మూడు, నాలుగు కిలోల బరువు పెరగడం వల్ల సినిమా అవకాశాలను కోల్పోయాను. ముక్కు బాగా లేదని, చెస్ట్ సైజ్ ఎందుకు పెద్దగా లేదు? అనే ప్రశ్నలు నన్ను చాలా బాధించాయి. ముఖ్యంగా పరిశ్రమలో శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న నటులు చాలామంది ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు పొందడానికి బాడీలోని పలు పార్ట్స్ కు సర్జీలు (Surjery) చేసుకున్నవాళ్లు ఉన్నారు. అలాంటివాళ్లకే అవకాశాలు క్యూ కడుతున్నాయి” అని రాధిక ఆప్టే అన్నారు. గతంలో కాస్టింగ్ కౌచ్ పై రాధిక బహిరంగంగానే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Breakup Controversy: బ్రేకప్ కు నో.. సిగరెట్లతో ప్రియుడి ఒళ్లంతా కాల్చిన ప్రియురాలు!