Vishal: విశాల్ పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ఫస్ట్ లుక్

యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లాఠీ' చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది.

  • Written By:
  • Publish Date - April 7, 2022 / 12:41 PM IST

యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో టాప్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణ లో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్ గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ కనిపించారు.

శరీరమంతా గాయాల తో పాటు భవనం నుండి లేజర్ కిరణాలు విశాల్ పై పడటం కూడా ఈ యాక్షన్ పోస్టర్ లో గమనించవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశాల్ పవర్ ఫుల్ గా కనిపించారు. యాక్షన్ తో నిండిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలని పెంచింది. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ తన ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.

విశాల్ సరసన సునైనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహకుడిగా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దిలీప్ సుబ్బరాయన్ మరో స్టంట్ మాస్టర్ గా పనిచేశారు.