Site icon HashtagU Telugu

VD : నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషన్ కాదు – విజయ్ దేవరకొండ క్లారిటీ

Vd Ed

Vd Ed

బెట్టింగ్ యాప్స్ (Betting apps) ప్రచారం కేసులో ఈడీ విచారణకు టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భాంగా తాను ప్రమోట్ చేసింది లీగల్ గేమింగ్ యాప్ మాత్రమే అని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కాదని సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్పష్టం చేశారు. ఈ రెండు అంశాల మధ్య తేడాను తెలుసుకోకుండానే వార్తలు రాస్తున్నారని ఆయన మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసుల్లో విచారణ జరుగుతున్నప్పటికీ, తనను మాత్రం గేమింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణ కోసం పిలిచారని ఆయన తెలియజేశారు. ఈ కేసులో విచారణ కోసం తనను పిలవగా, తాను అధికారులకు పూర్తి సహకారం అందించానని చెప్పారు.

Supreme Court : సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

విచారణ సందర్భంగా అధికారులు తనను అడిగిన సమాచారమంతా అందించానని, బ్యాంక్ లావాదేవీల వివరాలను కూడా సమర్పించానని విజయ్ దేవరకొండ తెలిపారు. తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, తాను చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించలేదని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో మీడియా, ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. లీగల్ గేమింగ్ యాప్‌లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి వార్తలు రాయాలని ఆయన సూచించారు.

Home Loan EMI: ఇలా చేస్తే మీ హోమ్ లోన్ ఈఎంఐ ఈజీగా రూ. 4 వేలు తగ్గించుకోవచ్చు

ఈ ఘటనతో సినీ సెలబ్రిటీలు యాప్‌ల ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టమైంది. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళాలకు తావు లేకుండా, ప్రచారం చేసే యాప్‌ల చట్టబద్ధతను సరిచూసుకోవడం ముఖ్యమని ఈ సంఘటన రుజువు చేసింది. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో, ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. లీగల్ గేమింగ్, బెట్టింగ్ మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవడం ఎంత అవసరమో ఈ సంఘటన తెలియజేస్తోంది.