Venky @ 20 Years : ‘వెంకీ’ కి 20 ఏళ్లు..

'ఈ సినిమాతో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. రవితేజ తన పాత్రను పోషించిన తీరు అద్భుతం

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 11:30 AM IST

ప్రతి ఏడాది టాలీవుడ్ (Tollywood) లో వందల సినిమాలు రిలీజ్ అవుతాయి..కానీ వాటిలో ఓ పది చిత్రాలు మాత్రమే ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఆ సినిమాలోని పాటలు , సన్నివేశాలు , కామెడీ ఇలా కొన్ని ఎప్పటికి గుర్తుకొస్తూ..చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తూ..ఆకట్టుకుంటాయి. అలాంటి చిత్రాల్లో వెంకీ (Venky ) చిత్రం ఒకటి. మాస్ మహారాజా రవితేజ (Raviteja) – స్నేహ (Senha) జంటగా శ్రీను వైట్ల (Sreenu Vaitla) డైరెక్షన్లో 2004 మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ..ఇప్పటికి బుల్లితెర ఫై అలరిస్తూనే ఉంటుంది. అలాంటి ఈ మూవీ నేటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్‌ కామెడీ సీన్ సినిమాకు ప్రాణం పోసింది. జనాలకు ట్రెస్‌ రిలీఫ్‌ లాంటిది. సాధారణ జనం దగ్గరినుంచి సెలెబ్రిటీల వరకు తమకు కాస్త మెంటల్‌ టెన్షన్‌గా ఫీలయినపుడు వెంకీ ట్రైన్‌ పార్టు చూసి కూల్‌ అవుతున్నారు. ట్రైన్‌లో రవితేజ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్రల గ్యాంగ్‌ చేసే హంగామా మామూలుగా ఉండదు. వీరితో పాటు గజాల పాత్రలో బ్రహ్మానందం, బొక్కా పాత్రలో ఏవీఎస్‌ కామెడీ కుమ్మేశారు. హీరోయిన్‌ స్నేహను ఇంప్రెస్‌ చేయడానికి రవితేజ అతకని అబద్ధాలు ఆడటం.. గజాల, బొక్కాల చేతిలో ఇరుక్కుపోవటం.. తర్వాత చోటు చేసుకునే ఫన్‌.. పడి పడి నవ్వించేలా చేస్తుంది. శ్రీను వైట్ల, కోన వెంకట్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో వెంకీ ది బెస్ట్‌ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెంకీని ఎన్ని సార్లు చూసినా బోరుకొట్టకుండా అద్భుతంగా తీర్చి దిద్దారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. సస్పెన్స్‌ కూడా సినిమాకు హైలెట్‌. ఇక, డైలాగులు , మ్యూజిక్ ఇలా ప్రతిదీ సినిమా విజయంలో కీలకంగా మారాయి.

ఇక ఈ మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా డైరెక్టర్ శ్రీను వైట్ల ట్వీట్ చేసారు. ‘ఈ సినిమాతో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. రవితేజ తన పాత్రను పోషించిన తీరు అద్భుతం. నటి స్నేహ, దేవిశ్రీ ప్రసాద్, గజాలా పాత్రలో బ్రహ్మానందం, గోపీమోహన్లకు థ్యాంక్స్. రీరిలీజూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది’ అని ఆయన తెలిపారు.

Read Also : CSK vs GT: ఐపీఎల్‌లో నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. సీఎస్‌కే వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్‌