దగ్గుపాటి రామానాయుడు (Ramanaidu) కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రామానాయుడు తనయుడు , నటుడు వెంకటేష్ రెండో కూతురు హవ్య వాహిని (Havya Vahini) నిశ్చితార్థ (Venkatesh Daughter Engagement) వేడుక హైదరాబాద్ (Hyderabad) లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు , కుటుంబ సభ్యులు హాజరయ్యారు. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తనయుడితో హవ్యవాహిని వివాహం జరగనుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం.
వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయి పెళ్లి కి సిద్ధమైంది. బుధవారం తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‌లో చాలా సైలెంట్‌గా పూర్తి చేసారు. ఈ వేడుకలో చిరంజీవి (Chiranjeevi), మహేష్ బాబు (Mahesh Babu), రానా (Rana), నాగచైతన్యతో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు సందడి చేశారు. హవ్య వాహిని ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇక వెంకీ పెద్ద కూతురుని హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి కి ఇచ్చి, 2019లో జైపూర్‌లో ఘనంగా పెళ్లి చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక వెంకటేష్ తన కుటుంబాన్ని ఎప్పుడు సోషల్ మీడియాకు దూరంగానే ఉంచుతూ వచ్చాడు. ఇప్పటివరకు భార్య నీరజ ఎవరో చాలా మందికి కూడా తెలియదు. సినిమా, క్రికెట్, కుటుంబం.. ఇవే వెంకటేష్ కు తెల్సినవి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసే రకం కాదు వెంకీ. అంతేకాదు పిల్లలను నటనలోకి తీసుకురావాలని కూడా అనుకోలేదు. వారికి నచ్చిన రంగంలో వారిని ఎదగాలని కోరుకున్నాడు. ఆశ్రిత పెళ్లి తరువాత ఒక ఫుడ్ బ్లాగర్ గా మారింది. హయవాహిని ఒక అథ్లెట్ అని సమాచారం. ఇక వెంకీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Read Also : Indrakaran: కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ, ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువు