నందమూరి బాలకృష్ణ (Balakrishna) కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలకృష్ణ కు సంబంధించి ఏది జరిగిన అది వైరల్ అవ్వాల్సిందే..ట్రేండింగ్ లో నిలువాల్సిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable) షో పైనే ఉంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అహా ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable with NBK ) షో పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కావడం..ఈ సీజన్ అంతకు మించి ఉండబోతుందని అంత భావిస్తున్నారు. ఇక ఈ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కు బాలయ్య బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో స్టార్ట్ చేయడం..విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో చూస్తే.. సరదాగా, ఆసక్తికర ప్రశ్నలతో సాగింది. ఈ ఎపిసోడ్ రేపు (శుక్రవారం) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది,
ఈ ఎపిసోడ్‌లో బాలయ్య పలు ఆసక్తికరమైన అంశాలపై చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా, రాష్ట్ర భవిష్యత్తు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో భేటీ, చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజుల అనుభవాలు, వ్యక్తిగత విషయాలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. టీజర్‌లో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు, అలాగే బాలయ్య కూడా కొన్ని సరదా ప్రశ్నలు అడిగి ఫన్నీ టాస్కులు ఇచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజంను అలా చేయమని కూడా కోరినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజున సెలవు ఇవ్వాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించడం, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ , చంద్రబాబుపై ఉన్న క్రేజ్‌ను ప్రదర్శించడం టాప్ టాపిక్‌గా మారింది. ఇది ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ 4 షో క్రేజ్‌ను మరింత పెంచింది.
Read Also : Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం