విజయ్, త్రిషల మధ్య ఉన్న బంధంపై వస్తున్న రూమర్లు ప్రస్తుతం కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో త్రిష పెట్టిన తాజా పోస్ట్ ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది. దళపతి విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. తన భర్తకు ఒక హీరోయిన్‌తో ఉన్న అక్రమ సంబంధం వల్లే తన వైవాహిక జీవితం దెబ్బతిన్నదని, మానసిక క్షోభకు గురవుతున్నానని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్‌తో గతంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిష పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీరిద్దరూ విదేశీ పర్యటనల్లో కలిసి కనిపించడం, ఇటీవల ఒకే కారులో ఒక వేడుకకు హాజరుకావడం వంటి ఘటనలు సంగీత ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.
త్రిష పోస్ట్ వెనుక పరమార్థం ఏమిటి?
ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో త్రిష తన ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది. “ప్రేమ మాత్రమే జీవితం కాదు.. కానీ ప్రేమ లేని జీవితానికి అర్థం లేదు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఒక రకంగా విజయ్‌తో తనకున్న బంధాన్ని పరోక్షంగా అంగీకరించడమేనని కొందరు అభిమానులు భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది సంగీత చేసిన ఆరోపణలకు కౌంటర్ అని విశ్లేషిస్తున్నారు. అంటే, తాము కేవలం వివాహేతర బంధంలో లేమని, తమ మధ్య ఉన్నది గాఢమైన ప్రేమ అని చెప్పడమే త్రిష ఉద్దేశమని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో పెను సంచలనం
విజయ్ తన సొంత పార్టీ ‘టీవీకే’ను స్థాపించి ఎన్నికల బరిలో దిగుతున్న తరుణంలో ఈ వ్యక్తిగత వివాదాలు ఆయనకు పెద్ద చిక్కుగా మారాయి. సాధారణంగా క్లీన్ ఇమేజ్‌తో ఉండే విజయ్, తన భార్యతో విడాకుల వ్యవహారం మరియు త్రిషతో అనుబంధం విషయంలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. త్రిష పెట్టిన పోస్ట్ వల్ల ఈ వివాదం సద్దుమణగాల్సింది పోయి, మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఒకవైపు సంగీత కోర్టులో పోరాడుతుంటే, మరోవైపు త్రిష ఇలాంటి పోస్ట్‌లతో తన ఉనికిని చాటుకోవడం విజయ్ అభిమానులను కూడా అయోమయానికి గురి చేస్తోంది. ఈ వ్యవహారం విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.
