Tripti Dimri : త్రిప్తి తెలుగు సినిమాలకు నో అనేస్తుందా.. కారణాలు ఏంటి..?

Tripti Dimri బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రికి వరుస అవకాశాలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్

Published By: HashtagU Telugu Desk
Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

Animal beauty Tirpti Dimri no chance for Pushpa 2 Item song

Tripti Dimri బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రికి వరుస అవకాశాలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా హీరోయిన్ రష్మిక కన్నా కూడా త్రిప్తికి ఎక్కువ క్రేజ్ వచ్చింది. యానిమల్ కు ముందు బాలీవుడ్ సినిమాలు, సీరీస్ లు చేసినా అమ్మడికి ఈ రేంజ్ క్రేజ్ రాలేదు.

యానిమల్ వల్ల డిమాండ్ పెరిగిన త్రిప్తి అందుకు తగినట్టుగానే డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. యానిమల్ క్రేజ్ తో టాలీవుడ్ నుంచి త్రిప్తికి ఆఫర్లు వచ్చాయని టాక్. ముఖ్యంగా మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో త్రిప్తి నటిస్తుందని అన్నారు. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న సినిమాలో త్రిపి కన్ ఫర్మ్ అన్నట్టు చెప్పుకొచ్చారు.

కానీ ఆ సినిమాలో త్రిప్తి ఇంకా ఫైనల్ అవ్వలేదని టాక్. అదే కాదు ఏ తెలుగు సినిమాను త్రిప్తి ఓకే చేయలేదట. మరి అమ్మడు అడిగినంత మన వాళ్లు ఇవ్వనన్నారా లేదా మరో కారణా అన్నది తెలియదు కానీ త్రిప్తి డిమ్రి టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. యానిమల్ లో అమ్మడి గ్లామర్ షోకి తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. తెలుగులో ఆమె సినిమాలు చేస్తే మాత్రం అభిమాన సంఘాలు ఏర్పడేలా ఉన్నాయి.

Also Read : Samantha : సమంత బంగారం సంథింగ్ స్పెషల్..!

  Last Updated: 04 May 2024, 11:50 PM IST