Site icon HashtagU Telugu

Pooja Hegde: పూజా హెగ్డేకు బెదిరింపు కాల్స్, అసలు విషయం ఇదే!

Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

Pooja Hegde Huge Demand for Naga Chaitanya movie

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేసిన వరుస సినిమాలు నిరాశపర్చినా.. ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. అయితే పూజా ఇటీవల దుబాయ్‌లోని ఓ కార్యక్రమానికి వెళ్లారని.. అక్కడ పెద్ద గొడవ జరగడంతో కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారని బాలీవుడ్‌ మీడియాలో ఓ వార్త వచ్చింది. దీంతో ఆమె అభిమానులు కంగారుపడుతూ ఏం జరిగిందంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు. తాజాగా దీనిపై పూజా టీమ్ క్లారిటీ ఇచ్చింది.

అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ‘అసలు ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో తెలియదు. ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి’ అని వెల్లడించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే టీమ్‌ క్లారిటీ ఇచ్చిన వెంటనే సదరు మీడియా సంస్థ కూడా ఆ వార్తను డిలీట్‌ చేసింది.

పూజా హెగ్డే బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ అందుకున్నా ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ అలానే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కి జోడిగా ‘దేవా’ అనే సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు సైన్ చేసింది ఈ బ్యూటీ.

Also Read: CM Revanth: స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు: సీఎం రేవంత్‌