Salman Khan Marriage: సల్మాన్ ఖాన్ పెళ్లి.. నాడు, నేడు భారత సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ సల్లూ భాయ్ ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ? కండల వీరుడు పెళ్లికి నో చెప్పడానికి కారణమేంటి ? అనే అంశాలపై ఆయన తండ్రి సలీం ఖాన్ తాజాగా కీలక వివరాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం..
Also Read :Tahawwur Rana: రాత్రికల్లా భారత్‌కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా.. ఇతడెవరు ?
సంగీతా బిజ్లానీ షాకింగ్ నిర్ణయంతో..
వాస్తవానికి తొలుత సంగీతా బిజ్లానీని పెళ్లి చేసుకోవాలని సల్లూ భాయ్(Salman Khan Marriage) భావించారట. అందుకే ఆమెతో కొన్నాళ్లు లవ్ స్టోరీని నడిపారట. అయితే ఆ సమయానికి సల్మాన్ ఖాన్ కెరీర్‌లో పెద్దగా సెటిల్ కాలేదు. దీంతో అప్పట్లో సంగీతతో పెళ్లిని ఫిక్స్ చేసుకునేందుకు సాహసం చేయలేకపోయారట. ఫలితంగా ప్రేమ వరకే ఆ బంధాన్ని ఆపేశారట. సంగీత, సల్మాన్ విషయంలో మరో అంశం కూడా ప్రచారం ఉంది. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయిందట. అయితే సోమీ ఆలీతో సల్లూభాయ్ అఫైర్ పెట్టుకున్నాడని తెలిసి.. సంగీతా బిజ్లానీ పెళ్లిని రద్దు చేసుకుందని అంటారు.
Also Read :Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
ఐశ్వర్య, కత్రినాలకు చెబితే.. నో అన్నారట
కట్ చేస్తే.. ఆ తర్వాతి కాలంలో సల్లూభాయ్ ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. ఆయన ఎన్నడూ తన ఫ్రీడమ్‌ను దుర్వినియోగం చేయలేదు. అందరు హీరోయిన్లతో జెంటిల్‌మన్‌లా నడుచుకున్నారు. తన కుటుంబాన్ని తన తల్లి చూసుకున్నట్టుగా.. తనకు కాబోయే భార్య కూడా ఇంటి పట్టునే ఉండాలని సల్మాన్ కోరుకున్నారట. తన గురించి, తన పిల్లల, తన పేరెంట్స్ గురించి ఆలోచించే మహిళ భార్యగా రావాలని సల్లూభాయ్ చెప్పేవారట. ఇదే విషయాన్ని అప్పట్లో ఐశ్వర్యా రాయ్, కత్రీనా కైఫ్‌లకు చెప్పారట. అయితే వారు అందుకు నో చెప్పారట. అలా ఉండలేమని స్పష్టం చేశారట. దీంతో సల్మాన్ తన దారిని తాను చూసుకున్నారు. బ్రహ్మచారిగా మిగిలిపోయారు. మరోవైపు ఐశ్వర్య, కత్రినాలు పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలయ్యారు.
తండ్రి సలీం ఖాన్ ఏం చెప్పారంటే.. ?
‘‘సల్మాన్‌తో నేను చాలా రోజులు మాట్లాడలేదు. ఒకే ఇంట్లో ఉన్నా సరే, తను నా దగ్గరికి వచ్చి ఏదీ అడగడు. చాలా విషయాలు మర్చిపోతుంటాడు. జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్న మనిషిలో ఆ మాత్రం పరధ్యానం ఉండడం సహజమే’’ అని సలీం ఖాన్ చెప్పుకొచ్చారు. ‘‘కొన్నిసార్లు సల్మాన్ ఖాన్ అడుగుల చప్పుడు వినిపించినా భయమేస్తుంది. ఎందుకంటే ఓ క్రికెటర్ సక్సెస్ అయితే అతని ఫోకస్ అంతా ఆటపైనే ఉంటుంది. అయితే సినిమాల్లో అలా కాదు. సినిమాలతో పాటు చాలా విషయాలను చూసుకోవాల్సి ఉంటుంది. చాలా వాటికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇదో రంగుల మాయా ప్రపంచం’’ అని సలీం ఖాన్ తెలిపారు.