Site icon HashtagU Telugu

Allu Arjun Episode: అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇదే.. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా!

Allu Arjun Episode

Allu Arjun Episode

Allu Arjun Episode: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun Episode) తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డిసెంబ‌ర్ 4వ తేదీన హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద ఉన్న సంధ్య థియేట‌ర్‌లో పుష్ప‌-2 మూవీ ప్రీమియ‌ర్ షో చూడ‌టానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ షో చూడ‌టానికి వెళ్లిన స‌మ‌యంలో థియేట‌ర్‌లో తొక్కిసలాట జ‌రిగి రేవతి అనే మ‌హిళ మృతిచెందింది. అలాగే ఆమె కొడుకు శ్రీతేజ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రేవతి భ‌ర్త ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ఏ11గా అల్లు అర్జున్‌ను చేర్చారు.

అయితే శుక్ర‌వారం ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్న ద‌గ్గ‌రి నుంచి బెయిల్ మంజూరు అయ్యే వ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఇప్పుడు చూద్దాం.

Also Read: Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశ‌గా ఎదురుచూస్తున్న అర్హ‌!

అల్లు అరవింద్‌కు సీఎం చంద్రబాబు ఫోన్

అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అరెస్టు ఘటనపై ఆందోళన చెందవద్దని చంద్రబాబు సూచించారు. ఈ కష్ట సమయంలో తమకు ఫోన్ చేసిన చంద్రబాబుకు అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలియజేశారు.