Site icon HashtagU Telugu

Megastar: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌‌ లో టర్నింగ్ పాయింట్స్ ఇవే..!

Megastar

Megastar Chiranjeevi comments on Cancer goes viral

Megastar: ఒక్కడిగా వచ్చి.. ఒకటిగా మొదలుపెట్టి.. ఒక్కొక్కటి సాధిస్తూ.. ఒకటో స్థానంలో రెండు దశాబ్దాలుకు పైగా నిలబడ్డ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ (Megastar) చిరంజీవి పుట్టిన రోజు. అయితే ఆయన కెరీర్‌‌ లో కొన్ని సంఘటనలు ఆయన జీవితాన్నే మార్చేశాయి. అవేంటో ఒకసారి చూద్దాం..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు. అప్పటికే పునాది రాళ్లు మొదలైనా తొలి విడుదల మాత్రం ప్రాణం ఖరీదే.
ప్రాణం ఖరీదు తర్వాత దాదాపు 20 సినిమాలు చేసినా చిరంజీవికి హీరోగా తగిన గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిందే ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య సినిమా. చిరుకు గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా తీసుకొచ్చింది.

మూవీస్ తో బిజీగా ఉన్న చిరు 1980లో సురేఖతో వివాహం జరిగింది. అప్పటికే చిరు 10 సినిమాలకు పైగా నటించారు. అల్లు రామలింగయ్య గారి అల్లుడు అయ్యాక మరింతగా కలిసి వచ్చింది అని అని చెప్పొచ్చు. మెగాస్టార్ క్రమశిక్షణ,సినిమాపై పిచ్చి ప్రేమ వలనే చిరు అనతికాలంలోనే అగ్ర స్థానానికి చేరుకున్నారు. 1983లో చిరంజీవి కెరీర్‌ను మార్చేసిన సినిమా ఖైదీ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంతో నెంబర్ వన్ వైపు తొలిసారి అడుగులు వేశాడు చిరంజీవి.

Also Read: Chiranjeevi Birthday Special : టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

1988లో మ‌ర‌ణ మృదంగం సినిమా షూటింగ్‌ను చెన్నైలో చిత్రీక‌రిస్తున్నారు. ఆ సమయంలో ఓ అభిమాని వ‌చ్చి తన పుట్టిన‌రోజు అని కేక్‌ను తినిపించబోయాడు. ఆ కేక్‌లో ఏదో రంగురంగుల ప‌దార్థాలు క‌నిపించాయి. మెగాస్టార్ మేక‌ప్ వేసుకునే స‌మ‌యంలో గ‌మ‌నిస్తే చిరంజీవి పెదాలు నీలి రంగులోకి మారాయి. డాక్ట‌ర్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లగా ఇది విష ప్రయోగం అని చెప్పారు. అప్పటి నుంచి బయటి ఫుడ్ అస్సలు తినరట చిరు. 1985లో చిరంజీవి అనే చిత్రంలో విలన్‌గా నటించాడు మెగాస్టార్.

1998లో వర్మతో ఒక సినిమా సైన్ చేశాడు చిరంజీవి. రెండు పాటలు కూడా చిత్రీకరించారు. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. 1991లో గ్యాంగ్ లీడర్ మూవీ అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది. 2008లో రాజకీయ పార్టీ స్టార్ట్ చేసి దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.

2017లో రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం 150తో మళ్లీ తనేంటో నిరూపించుకున్నారు మెగాస్టార్. 2022లో ఇక సినిమాలకు దూరం కానని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం రెండు సినిమాలతో చిరు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version