Site icon HashtagU Telugu

The Raja Saab : టీజర్ రిలీజ్ అవుతున్న సమయంలో ‘రాజా సాబ్’ మూవీ టీంకు బిగ్ షాక్

Prabhas Rajasaab Teaser

Prabhas Rajasaab Teaser

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) టీజర్ రిలీజ్‌కు ముందు లీక్ కావడంతో మూవీ యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 16న టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని టీజర్ విజువల్స్ ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందానికి ఊహించని షాక్‌ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన మూవీ టీం, అనధికార కంటెంట్‌ను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్‌ రైలు..ప్రయాణికులు అవస్థలు

‘ది రాజాసాబ్’ టీజర్ లీక్ వ్యవహారంపై చిత్రబృందం తీవ్రంగా స్పందిస్తూ, లీకైన కంటెంట్‌ను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఉల్లంఘన చేసిన వారి సోషల్ మీడియా ఖాతాలను రిపోర్ట్ చేయించి బ్లాక్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మూవీకి సంబంధించి ప్రేక్షకులకు విశిష్టమైన అనుభూతిని అందించేందుకు టీం తీవ్రంగా శ్రమిస్తోందని పేర్కొంది. ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆ కంటెంట్‌ను చూసి వ్యాపింపజేయకుండా సహకరించాలని కోరారు.

Metro : మెట్రో రైలు ట్రాక్ కాంక్రీట్ బీమ్ కూలడంతో వ్యక్తి మృతి

ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా, సంజయ్ దత్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ఈ నెల 16న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ 5న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారని మేకర్స్ వెల్లడించారు. అయితే టీజర్ ముందే లీక్ కావడం వల్ల సినిమాపై ఉన్న ఉత్కంఠ మరింత పెరిగిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.