యంగ్ హీరో నితిన్ (Nithin) నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(Thammudu ) ఈరోజు జూలై 4న గ్రాండ్‌గా విడుదలైంది. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. పవన్ కళ్యాణ్ నటించిన క్లాసిక్ మూవీ తమ్ముడు టైటిల్‌ను పెట్టుకోవడం తో ఈ సినిమాపై కొంత హైప్ ఏర్పడింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది.
ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, కెమెరామెన్‌గా కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు పనిచేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో టాప్ టెక్నీషియన్లు పని చేయడం వల్ల విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఫస్ట్ హాఫ్ స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉందని, ఎమోషనల్ సీన్లు అంతగా కనెక్ట్ కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
Layoffs : భారీ లేఆఫ్స్.. ఉద్యోగం పోతుందని వణుకుతున్న ఐటీ ఉద్యోగులు.. లక్షమందికి పింక్ స్లిప్స్!
సినిమాలో ఇంటర్వెల్ బాంగ్ ఆకట్టుకుందనీ, కొన్ని కామెడీ, యాక్షన్ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయని కొంత మంది ప్రేక్షకులు చెప్పుతున్నారు. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మొత్తం సినిమాకి సంబంధించి మిక్స్‌డ్ టాక్ రావడం, కంటెంట్ పరంగా మెప్పించలేకపోవడం ఓవరాల్‌గా సినిమాను యావరేజ్ రేంజ్‌లో నిలిపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ పూర్తి రివ్యూలు వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది.