Tamannaah Bhatia: నా బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. అసలు విషయం లీక్ చేసిన తమన్నా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. ఈమె తెలుగు, తమిళం,హిందీ […]

Published By: HashtagU Telugu Desk
Tamannaah Bhatia

Tamannaah Bhatia

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అయిన కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా తమన్నా ప్రస్తుత వయసు 33 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అదే ఎనర్జీతో వరుసగా అవకాశాలను అందుకుంటు తీసుకుపోతోంది. ఈమె తెలుగు, తమిళం,హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

We’re now on WhatsApp. Click to Join
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లు, పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది మిల్క్ బ్యూటీ. కాగా ఈమె వయసుతో పాటు ఆమె అందం కూడా పెరుగుతోంది. అయితే తమన్నా ను చూసిన ఈసారి ఆమె అన్నం తింటుందా అందం తింటుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే తాజాగా తన బ్యూటీ సీక్రెట్స్ ని రివీల్ చేసింది తమన్న. తాజాగా తమన్నా తన డైలీ రొటీన్, తాను తినే ఫుడ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తమన్నా తన డైలీ రొటీన్ గురించి మాట్లాడుతూ.. ఎంత బిజీగా ఉన్నా ఉదయం యోగా, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, కార్డియో లాంటివి కనీసం గంటసేపైనా చేస్తాను.

Also Read: Aarti Chabria: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల కిందటే అమ్మా అయ్యానంటూ!

ఉదయం నానబెట్టిన బాదంపప్పులతో నా డైట్ ప్రారంభం అవుతుంది. బ్రేక్ ఫాస్ట్ లోకి ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహరం తీసుకుంటాను. లంచ్ లోకి పప్పు, బ్రౌన్ రైస్, ఉడికించిన కూరగాయ ముక్కలు, కూరలు తింటాను. సాయంత్రం జ్యూస్ లు తాగుతాను. రాత్రికి మిల్లెట్స్ తో చేసిన స్నాక్స్ తింటాను. రోజులో వాటర్, జ్యూస్ ఎక్కువగా తాగుతాను. అలాగే రోజులో ఒక అరగంటైనా వాకింగ్ ఉండేలా చూసుకుంటాను అని తెలిపింది. అలాగే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటాను అని, మనసు ఆనందంగా అంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటామని తెలిపింది.

Also Read: Meera Jasmine: మొదటిసారి ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేసిన మీరా జాస్మిన్.. పోస్ట్ వైరల్!

  Last Updated: 08 Apr 2024, 05:56 PM IST