Taapsee: సినిమాలపై కంటే వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ చేస్తాను: తాప్సీ

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 12:20 PM IST

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది తాప్సీ. కాగా ఈమె తెలుగులో దరువు, మొగుడు, మిషన్ ఇంపాజిబుల్,వస్తాడు నా రాజు, ఝుమ్మంది నాదం, షాడో నీవెవరో,ఆనందో బ్రహ్మ, ఆడు కలం, సాహసం, నీడ, గుండెల్లో గోదారి లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

We’re now on WhatsApp. Click to Join
అలా ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ,తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తమిళం హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే మొన్నటి వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన తాప్సి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ తరచూ తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది తాప్సి.

Also Read: Nayanthara : అర్ధరాత్రి రోడ్డుపై అలాంటి పని చేస్తున్న నయనతార.. వీడియో వైరల్!

కాగా డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్‌పూర్‌లో జరిగిందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్‌ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూ వరులుగా తాప్సీ, మథియాస్‌ ఉన్న వీడియోలు వైరల్‌ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఒక మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఒకసారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్ని ఇవ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను 12 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపై కన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్‌ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్‌కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ తాప్సీ.

Also Read: Pushpa 2: యశ్ రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టనున్నాడా.. పై చేయి మాత్రం ఆ హీరోదే!