Gaddar Awards : ఆ ఒక్క ‘వర్డ్’ సూర్య నానికి సారీ చెప్పేలా చేసింది

Gaddar Awards : “నేచురల్ స్టార్ నాని సర్.. నిన్న షూటింగ్ బిజీగా ఉండటంతో మీకు సరైన రిప్లై ఇవ్వలేకపోయాను. కానీ మీరు లేకపోతే ఈ అవార్డు నా దాకా వచ్చేది కాదు.

Published By: HashtagU Telugu Desk
Surya Nani

Surya Nani

నాని, ఎస్ జే సూర్య (Nani – SJ Surya) కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా ఎస్ జే సూర్య నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. నిజానికి ఈ సినిమాలో హీరో అయినా నానిని కంటే ఎస్ జే సూర్య నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయని చాలామంది అభిమానులు, విమర్శకులు అభిప్రాయపడ్డారు. నాని కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. కథ విన్నప్పుడే ఈ పాత్ర ఎంత పటిష్టమో తనకు తెలుసని, సూర్య నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని నాని ప్రశంసలు కురిపించారు.

Spirit : డైరెక్టర్‌ వంగాతో గొడవపై క్లారిటీ ఇచ్చి దీపిక

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను (Gaddar Award) ప్రకటించగా ‘ఉత్తమ సహాయ నటుడు’ కేటగిరీలో ఎస్ జే సూర్యకు అవార్డు లభించింది. ‘సరిపోదా శనివారం’లో ఆయన పోషించిన పాత్రకు ఈ గౌరవం దక్కింది. ఈ వార్తతో సినిమా టీమ్‌ అంతా హర్షం వ్యక్తం చేశారు. ఎస్ జే సూర్య స్వయంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో నాని కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ “కంగ్రాట్స్ సర్” అంటూ ట్వీట్ చేశారు.

India-US: భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైంది: ట్రంప్‌

నాని ట్వీట్‌కు ముందుగా “థాంక్యూ సర్” అని మాత్రమే రిప్లై ఇచ్చిన సూర్య.. తరువాత తన చెప్పాలనుకుంది బయటపెట్టారు. “నేచురల్ స్టార్ నాని సర్.. నిన్న షూటింగ్ బిజీగా ఉండటంతో మీకు సరైన రిప్లై ఇవ్వలేకపోయాను. కానీ మీరు లేకపోతే ఈ అవార్డు నా దాకా వచ్చేది కాదు. మీరు తెరపై మాత్రమే కాదు, తెర వెనక కూడా హీరో” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

  Last Updated: 31 May 2025, 02:05 PM IST