Surya 44 : సూర్య 44 అప్డేట్ వచ్చేసింది..!

సినిమాకు సంబందించిన ప్రీ లుక్ ని రివీల్ చేస్తూ నేడు అర్ధరాత్రి 12:12 గంటలకు ఫస్ట్ లుక్ వస్తుందని అనౌన్స్ చేశారు. అర్ధరాత్రి రిలీజ్ చేస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Surya 44 Special Update Coming Tonight 12 12

Surya 44 Special Update Coming Tonight 12 12

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం శివ డైరెక్షన్ లో చేస్తున్న కంగువ (Kanguva) సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాకుండానే కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టాడు సూర్య (Surya). జిగుర్తండా డబుల్ ఎక్స్ సినిమా తర్వాత కార్తీక్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాగా ఇది సూపర్ క్రేజ్ ఏర్పచుకుంది. సూర్య 44 లో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.

ఐతే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక పోస్టర్ వదిలారు. సినిమాకు సంబందించిన ప్రీ లుక్ ని రివీల్ చేస్తూ నేడు అర్ధరాత్రి 12:12 గంటలకు ఫస్ట్ లుక్ వస్తుందని అనౌన్స్ చేశారు. అర్ధరాత్రి రిలీజ్ చేస్తున్నారు అంటే సంథింగ్ స్పెషల్ గా ఈ పోస్టర్ ఉంటుందని చెప్పొచ్చు. ఆమధ్య సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో కూడా సూర్య లాంగ్ హెయిర్ తో వింటేజ్ లుక్ లో కనిపించాడు.

సూర్య నుంచి రాబోతున్న మాస్ సినిమాగా కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) సినిమా వస్తుందని చెప్పొచ్చు. సినిమాకు సంబందించి ఇప్పటివరకు ఎలాంటి లీక్స్ రాలేదు కానీ ఒకవేళ పోస్టర్ వస్తే లుక్ దానితో పాటు కథ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాలో సూర్య తో పూజా హెగ్దే (Pooja Hegde) రొమాన్స్ చేస్తుండగా ఆఫ్టర్ బీస్ట్ కోలీవుడ్ లో పూజా హెగ్దే ఈ ఛాన్స్ అందుకుంది.

సూర్య సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే కంగువ సినిమాకు తెలుగులో కూడా భారీ డీల్ సెట్ చేసుకుంటున్నారు. ఇక కార్తీక్ సుబ్బరాజుతో చేసే సినిమాకు కూడా తెలుగు నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. సూర్య కంగువ అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేయగా సూర్య 44వ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : Raviteja Mr Bacchan : రవితేజ మిస్టర్ బచ్చన్ లో మరో హీరో..!

  Last Updated: 22 Jul 2024, 10:48 PM IST