Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

తనదైన ఫైర్‌బ్రాండ్ మాటలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తాజాగా నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య ధరించిన డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్ క్యాన్స్ లుక్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, ట్రోల్స్‌కు ఘాటుగా బదులిచ్చారు. ఐశ్వర్య అద్భుతమన్న ఫైర్‌బ్రాండ్ “ఫ్యాషన్, స్టైల్ అనేవి వ్యక్తిగతం. జీవితం పట్ల, మన […]

Published By: HashtagU Telugu Desk
A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

తనదైన ఫైర్‌బ్రాండ్ మాటలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తాజాగా నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య ధరించిన డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్ క్యాన్స్ లుక్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, ట్రోల్స్‌కు ఘాటుగా బదులిచ్చారు.

ఐశ్వర్య అద్భుతమన్న ఫైర్‌బ్రాండ్

“ఫ్యాషన్, స్టైల్ అనేవి వ్యక్తిగతం. జీవితం పట్ల, మన వైఖరి పట్ల మనకున్న అభిప్రాయాన్ని అవి ప్రతిబింబిస్తాయి. ఏ మహిళ ఎవరికీ ఏమీ రుణపడి ఉండదు. ఐశ్వర్య అద్భుతంగా ఉన్నారు. ఆమెను మరోలా చూడాలనుకునే వారు, ముందు మీ సంగతి మీరు చూసుకోండి. ఆమె మిమ్మల్ని మెప్పించడానికి ఇక్కడికి రాలేదు. ఆమె చాలా గొప్పగా ఉన్నారు. రెడ్ కార్పెట్‌పై వయసు పైబడిన మహిళలను చూడటం మీకు అలవాటు లేకపోతే, ఇప్పటినుంచైనా అలవాటు చేసుకోండి” అంటూ కంగనా తన పోస్టులో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..!

క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ చాలా ఏళ్లుగా హాజరవుతున్నారు. ఈ ఏడాది కూడా ఆమె తన ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన శిల్పకళను తలపించే నీలం రంగు గౌన్‌తో ఆమె రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. ఆమె ప్రయోగాత్మక శైలిని, నిలబడిన తీరును చాలామంది ప్రశంసించారు. అయితే, అదే సమయంలో కొంతమంది నెటిజన్లు ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ‘ఫ్యాట్ ఆంటీ’ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కంగనా ఆమెకు మద్దతుగా నిలిచారు.

‘లుమినారా’ అని పిలిచే ఈ గౌన్‌ను కాంతి, కదలిక, పరివర్తన అనే భావనలతో రూపొందించినట్లు డిజైనర్ అమిత్ అగర్వాల్ తెలిపారు. దశాబ్దాలుగా ప్రపంచ వేదికపై ఐశ్వర్య ప్రదర్శిస్తున్న తేజస్సును గౌరవిస్తూ దీనిని తయారు చేశామన్నారు. ఈ ఫెస్టివల్‌లోనే ఐశ్వర్య పింక్ గౌన్, వైట్ ప్యాంట్ సూట్‌లో కూడా కనిపించారు. ఈ వేడుకలకు ఆమె తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు.

  Last Updated: 25 May 2026, 11:09 AM IST