Sunny Leone : సన్నీలియోన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది

నిత్యం సెగలు రేపు అందాలతో కనిపించే ఈమె..ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించేసరికి నిజంగా సన్నీనేనా అని ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు

Published By: HashtagU Telugu Desk
Sunny Ganga

Sunny Ganga

సన్నీలియోన్ (Sunny Leone) అనగానే ఎవరికైనా హాట్ వీడియోస్ , హాట్ ఫొటోస్ మాత్రమే గుర్తుకొస్తాయి. ఫోర్నస్టార్ గా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా ఈ అమ్మడు..ఆ తర్వాత చిత్రసీమ ( Film Industry )లో అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ (Bollywood) తో పాటు మిగతా భాషల్లో కూడా పలు సినిమాల్లో , ఐటెం సాంగ్స్ లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీ గా ఉంటూనే..సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటోస్ , వీడియోస్ తో వార్తల్లో నిలుస్తుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అభిమానులకు నెటిజన్లకు షాక్ ఇచ్చింది. నిత్యం సెగలు రేపు అందాలతో కనిపించే ఈమె..ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించేసరికి నిజంగా సన్నీనేనా అని ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. నిన్న గురువారం వారణాసి(Varanasi )లో గంగాహారతి(Ganga Aarti)కి సన్నీ హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఆమె భక్తిశ్రద్ధలతో పూజలు చేసింది. ఆ పూజకు సంబందించిన ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పింక్ డ్రెస్‌ లో, మెడలో దండతో కార్యక్రమానికి హాజరైంది. పండితులు పూజలు చేస్తుంటే రెండు చేతులు కలిసి నమస్కరిస్తూ.. కనిపించింది. ఆమెతోపాటు నటుడు అభిషేక్ కూడా ఉన్నారు. ఇక హాట్ స్టార్ గా ఉన్న సన్నీ ఇలా రావడంతో అక్కడ ఆమెను చూసేందుకు జనం ఎగబడ్డారు. హాట్ హాట్ గా ఉండే సన్నీలియోన్.. ఇలా కనిపించేసరికి అంతా విచిత్రంగా చూసారు.

Read Also : Madhya Pradesh Assembly Elections : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత

  Last Updated: 17 Nov 2023, 03:21 PM IST