Bollywood To Tollywood : బాలీవుడ్ నటుడు సన్నీదేవల్ సంచలన ప్రకటన చేశారు. తనకు టాలీవుడ్‌లో సెటిల్ కావాలని ఉందని ఆయన వెల్లడించారు. బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ కమర్షియల్‌గా మారిపోయినందున తాను టాలీవుడ్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు సన్నీ తెలిపారు. బాలీవుడ్ నిర్మాతల కమర్షియల్ ధోరణి వల్లే బాలీవుడ్ సినిమాలను ప్రజలు అంతగా ఇష్టపడటం లేదని కామెంట్ చేశారు. ‘‘గతంలో మూవీ స్టోరీని డైరెక్టర్ వివరిస్తే.. నిర్మాతలు వినేవారు. అది బాగుంటే ఓకే చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇండస్ట్రీ అంతా కమర్షియల్‌గా మారింది’’ అని సన్నీ వ్యాఖ్యానించారు.
Also Read :Indians On Hold : ‘కస్టమర్ కేర్’ హారర్.. ఏడాదిలో 1500 కోట్ల గంటలు హోల్డ్‌లోనే
‘‘టాలీవుడ్ వాళ్లను చూసి బాలీవుడ్ నిర్మాతలు చాలా నేర్చుకోవాలి. దక్షిణాదిలో యాక్టర్లను గౌరవిస్తారు. సినిమాను ఎలా నిర్మించాలో టాలీవుడ్ వాళ్లకు తెలుసు. వాళ్లను చూసి బాలీవుడ్ నిర్మాతలు నేర్చుకోవాలి. టాలీవుడ్ వాళ్లతో కలిసి పని చేయడం నాకు నచ్చింది. నేను వాళ్లతో మరో మూవీ చేయాలని అనుకుంటున్నాను’’ అని ఆయన వెల్లడించారు.
Also Read :Yunus Vs Army : బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ? యూనుస్ ఖేల్ ఖతం!
ప్రస్తుతం ‘జాట్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న మూవీలో సన్నీ దేవల్(Bollywood To Tollywood) నటిస్తున్నారు. దీనికి డైరెక్టరుగా టాలీవుడ్‌కు చెందిన గోపీచంద్ మలినేని వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌ను వదిలేస్తానని ఇటీవలే దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రకటించారు. ఇప్పుడు సన్నీ దేవల్ కూడా ఆయన లాగే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జాట్ మూవీలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే దీన్ని ట్రైలర్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ కానుంది.సన్నీదేవల్ ఆషామాషీ వ్యక్తేం కాదు. ఆయనకు పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉంది. సన్నీ తండ్రి మరెవరో కాదు..ప్రఖ్యాత నటుడు ధర్మేంద్ర. సన్నీ దేవల్ నటించిన మొదటి సినిమా 1983లో విడుదలైంది. ఆ మూవీ ‘బేతాబ్’ అనే టైటిల్‌తో విడుదలైంది. అందులో అమ్రితా సింగ్ హీరోయిన్‌గా నటించారు.