Site icon HashtagU Telugu

Arrest warrant : అరెస్ట్‌ వారెంట్‌ పై స్పందించిన సోనూసూద్‌

Sonu Sood responded to the arrest warrant

Sonu Sood responded to the arrest warrant

Arrest warrant : ప్ర‌ముఖ న‌టుడు సోన్ సూద్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగ‌తి తెలిసిందే. రూ.10 ల‌క్ష‌ల ఫ్రాడ్ కేసులో భాగంగా ఆయ‌న‌కు కోర్టు నోటీసులు ఇవ్వ‌గా అత‌డు హాజ‌రుకాక‌పోవ‌డంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవ్వ‌డంతో సోన్ సూద్ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టాడు.

Read Also: Migraine Pain : మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం కలిగించే 5 యోగా ఆసనాలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైర‌ల్ అవుతున్న వార్త‌లపై నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ విష‌యం గురించి సూటిగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి సంబంధం లేని కేసు విష‌యంలో కోర్టు న‌న్ను సాక్షిగా హాజ‌రుకావాల‌ని పిలిచింది. దీనిపై మా న్యాయవాదులు స్పందించారు. అలాగే ఫిబ్ర‌వ‌రి 10న ఈ కేసు విష‌యంలో మాకు సంబంధం లేదంటూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌బోతున్నాం. ఇలాంటి వార్త‌లపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తుంది. ఈ విషయాల్లో సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం. దీనిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ సోను సూద్ వెల్లడించారు.

కాగా, లుథియానా కు చెందిన అడ్వకెట్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సోనూ సూద్ సాక్షిగా ఉన్నారని సదరు న్యాయ మూర్తి తెలిపాడు.. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు సోనూ సూద్ కు నాన్ బెయిలాబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూసూద్ కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరవ్వలేదు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేసును ఈ నెల 10 న మరోసారి విచారణ జరిపించడం ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also:  Pistachios : శీతాకాలంలో పిస్తాపప్పులు ఆరోగ్యానికి ఎలా మంచివి..?