Site icon HashtagU Telugu

Simbu Donates for AP and TG Floods : తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన ఒకే ఒక తమిళ్ హీరో

1st Tamil Hero To Help Floo

1st Tamil Hero To Help Floo

The 1st Tamil Hero To Help Flood Victims In Telugu States : భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు (Telugu States) సాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నేతలు , ప్రభుత్వ ఉద్యోగులు , బిజినెస్ రంగం వారు ఇలా ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం అందజేస్తూ తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా తమిళ్ ఇండస్ట్రీ నుండి శింబు (Simbu ) సాయం చేసారు. ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తనవంతు సాయంగా రూ.6 లక్షలు (Rs 6 lakhs) విరాళం అందిస్తున్నట్లు శింబు ప్రకటించారు. తెలంగాణ, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.3 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.

శింబు సాయంపై నెటిజన్లు , సినీ లవర్స్ అభినందిస్తున్నారు. మన తెలుగు హీరోలు దేశంలో ఎక్కడ విపత్తు జరిగిన తమ వంతు సాయం చేయడం లో ముందుంటారు. కానీ ఇతర భాషల హీరోలు మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు ఆపద వస్తే సాయం చేసేందుకు మాత్రం ముందుకు రారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్ హీరోలు ఎంతోమంది మన డైరెక్టర్లతో వర్క్ చేసారు. వారి సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విజయం సాగిస్తుంటాయి. తెలుగు హీరోల మాదిరి వారికీ ఇక్కడ మంచి మార్కెట్ ఉంటుంది. అలాంటప్పుడు తెలుగు ప్రజలు ఆపదలో ఉంటె సాయం చేయాల్సిన బాధ్యత వారికీ లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. మరి శింబు ను చూసైనా కాస్త ముందుకు వచ్చి సాయం చేయాలనీ కోరుతున్నారు.

Read Also : Salt Tea: ఉప్పు క‌లిపిన టీ తాగితే..? బెనిఫిట్స్ ఇవే..!