Kiara Advani Lip Lock బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా కియరా అద్వానిల జంట ఎక్కడ కనిపించినా సరే కెమెరాలన్నీ క్లిక్ అనిపిస్తాయి. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ ఇద్దరు వారి పర్సనల్ లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వారి పర్సనల్ లైఫ్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. లేటెస్ట్ గా సిద్ధార్థ్ మల్ హోత్రా బర్త్ డే సందర్భంగా కియరాతో ఘాటైన ముద్దు ఫోటో బయటకు వచ్చింది.
We’re now on WhatsApp : Click to Join
హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ కియరా సిద్ధార్థ్ ఘాటైన అదర చుంభనం తో దిగిన ఫోటో ఒకటి షేర్ చేసింది. అసలే కియరా హాట్ ఫోజులతో ఆమె ఫాలోవర్స్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంటే భర్తతో కలిసి దీన ఈ హాట్ పిక్ తో ఇంటర్నెట్ షేక్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా కియరాకి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ నటించిన భరత్ అనే నేనుతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తర్వాత వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వగా మరోసారి చరణ్ తో కలిసి గేం చేంజర్ సినిమాలో నటిస్తుంది. కియరా సిద్ధార్థ్ జంట కలిసి ఒకటి రెండు సినిమాల్లో అలరించారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 7న మ్యారేజ్ చేసుకున్నారు.
సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ గురించి ఆడియన్స్ లో ఎప్పుడు ఒక ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. ఈ క్రమంలో సిద్ధార్థ్ కియరాల గురించి ఆడియన్స్ ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సిద్ధార్థ్ బర్త్ డే రోజు స్పెషల్ పార్టీ ఎరేంజ్ చేసి అతనికి ఘాటైన ముద్దు ఇచ్చింది కియరా.
Also Read : Udaya Bhanu : యాంకర్‌గా ఉదయభాను రీఎంట్రీ.. ‘సూపర్ జోడీ’ షో వివరాలివీ
ప్రస్తుతం సిద్ధార్థ్, కియరాల లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బాలీవుడ్ మీడియాలోనే కాదు సౌత్ మీడియాలో కూడా ఈ ఫోటో వైరల్ గా మారింది. కియరా తెలుగులో ఛాన్స్ లు వస్తున్నా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది.గేం చేంజర్ హిట్ పడితే మాత్రం మళ్లీ సౌత్ నుంచి కియరాకి మరిన్ని అవకాశాలు వచ్చేస్తాయని చెప్పొచ్చు. బాలీవుడ్ లో కూడా కియరా దూసుకెళ్తుంది. వరుస సినిమాలతో అమ్మడు అక్కడ ఇక్కడ అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.