Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన అర్ధాంగి శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త తెలియగానే నారా, నందమూరి కుటుంబాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా రోహిత్, శిరీషలది ప్రేమ వివాహం. ‘ప్రతినిధి 2’ చిత్రంలో కలిసి నటించినప్పుడు వీరి మధ్య ఏర్పడిన […]

Published By: HashtagU Telugu Desk
Another heir for the Nara family... Nara Rohit's wife, Shirisha, gives birth to a baby boy.

Another heir for the Nara family... Nara Rohit's wife, Shirisha, gives birth to a baby boy.

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన అర్ధాంగి శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త తెలియగానే నారా, నందమూరి కుటుంబాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నారా రోహిత్, శిరీషలది ప్రేమ వివాహం. ‘ప్రతినిధి 2’ చిత్రంలో కలిసి నటించినప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2024 అక్టోబర్ 13న నిశ్చితార్థం చేసుకోగా, 2025 అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లయిన ఏడాదిలోపే తమ బంధానికి గుర్తుగా వారసుడు రావడంతో రోహిత్ ఇంట సంతోషం రెట్టింపైంది.

కెరీర్ పరంగా నారా రోహిత్ మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా కంటెంట్ ప్రాధాన్యమున్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ‘సుందరకాండ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, నటుడిగా విమర్శకుల ప్రశంసలు పొందారు.

ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌లోనే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ నారా రోహిత్ ఫుల్ బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరాకు విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు సోలో హీరోగా మరో ప్రాజెక్టుకు కూడా ఆయన సంతకం చేశారు. ఇలా ఒకవైపు తండ్రిగా కొత్త బాధ్యతలను స్వీకరిస్తూనే, మరోవైపు వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతూ నారా రోహిత్ డబుల్ హ్యాపీనెస్ అనుభవిస్తున్నారు.

  Last Updated: 23 Jun 2026, 10:22 AM IST