Site icon HashtagU Telugu

Shruti Haasan : శృతి హాసన్ ..రెండో బాయ్‌ఫ్రెండ్‌కు కూడా బై బై చెప్పిందా..?

Shruti Haasan Broke Up

Shruti Haasan Broke Up

శృతి హాసన్ (Shruti Haasan)..తన రెండో బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా (Santanu Hazarika) బై బై (Broke up)చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఫోటోగ్రాఫర్‌తో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ..కొంతకాలానికి అతడితో విడిపోయి..తర్వాత శంతనుతో ప్రేమలో పడింది. నాలుగైదేళ్లుగా వీరిద్దరి ఘాటైన ప్రేమలో ఉన్నారు. నిత్యం శాంతనుతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను శృతిహాసన్‌ తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..అభిమానులను సంతోష పరుస్తూ వస్తుంది. ఈ ఫొటోస్ , వీడియోస్ చూసిన వారంతా ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతారని అంత అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఆమె ఇన్స్టార్ లో శాంతను అన్‌ఫాలో చేయడమే. అంతే కాదు శాంతనుతో దిగిన ఫోటోలను సైతం ఆమె డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ విడిపోయారని అంత ఫిక్స్ అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే చాలా మూవీ ఫంక్షన్‌లకు, ఇతర వేడుకలకు శ్రుతి హాసన్‌, శాంతను కలిసి హాజరయ్యేవారు. అయితే ‘హీరామండీ’ ప్రీమియర్ షోకి ఆమె ఒంటరిగా వచ్చింది. ఇద్దరూ విడిపోయి చాలా రోజులు అయిందని, ఇద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని బాలీవుడ్ అంటుంది. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి రూమర్స్ వస్తే శ్రుతి సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై ఇంకా ఇరు వర్గాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సో స్పందన రాలేదంటే ఇది నిజమే కావొచ్చని అంత నమ్ముతున్నారు. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా సలార్ తో సూపర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ షూటింగ్ లో శృతి బిజీ గా ఉంది.

Read Also : AP Elections : పోటీ నుండి తప్పుకుంటే వైసీపీ రూ.5 కోట్లు ఇస్తామన్నారు – దస్తగిరి