Shruti Haasan: పెళ్లిపై శృతి హాసన్ హాట్ కామెంట్స్.. ఒక్కసారిగా ఆ మాట అనేసిన బ్యూటీ!

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 08:45 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శృతిహాసన్ ఆ తర్వాత కొద్ది కాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది శృతిహాసన్. విశ్వ నటుడు కమలహాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. శృతిహాసన్ కు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మా అందరికీ తెలిసిందే.

ఈమె సినిమాలపరంగా కెరీర్ పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్, లైవ్ చాట్ చేస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె ఇంకా ఏడాది క్రాక్ సినిమాతో మళ్ళీ రిఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా నటించింది. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతిహాసన్ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు నందమూరి బాలయ్య బాబు 107వ చిత్రం, లాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాబీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన శృతిహాసన్ ఈ మధ్యకాలంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శృతిహాసన్ పెళ్లి విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లిదండ్రులైన కమల్ హాసన్, సారిక విడాకుల చూసి తాను ఈ కామెంట్స్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కలసి ముంబైలో నివసిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అంటే నమ్మకం ఉన్నప్పటికీ లోపల మాత్రం ఏదో తెలియని ఆందోళన ఉన్నట్టు తెలిపింది. పైగా శాంతను తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన లైఫ్‌లో ఎన్నో మార్పులొచ్చాయని,తన ఆలోచనలు అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది శృతిహాసన్. మరి ఈమె డేటింగ్ చేస్తున్న బాయ్ ఫ్రెండ్ శాంతనుతో ఈమె ప్రేమాయణం పెళ్లి పీఠల వరకు వెళుతుందా లేదా అనేది చూడాలి మరి..