Site icon HashtagU Telugu

Janasena : జనసేన కోసం భారీగా ఖర్చుచేసా..కానీ పవన్ పట్టించుకోలే – జబర్దస్త్ నటుడు

Shakalaka Shankar Janasena

Shakalaka Shankar Janasena

జబర్దస్త్ షో (Jabardasth Show) ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన షకలక శంకర్ (Shakalaka Shankar).. సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. అలాంటి శంకర్ పవన్ (Pawan Kalyan) కోసం భారీగా ఖర్చు చేసాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా అభిమానులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఆ అభిమానంలోనే శంకర్ జనసేన (Janasena) పార్టీ కోసం తన సొంత డబ్బును ఖర్చు పెట్టానని వెల్లడించాడు. 2019 ఎన్నికల సమయంలో తుఫాను వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించారని, ఆ తర్వాత తాను కూడా అక్కడకు వెళ్లి దాదాపు రూ.3 లక్షలతో భోజన వసతి ఏర్పాటు చేశానని చెప్పాడు. మిగిలిన డబ్బును జనసేన ప్రచారం కోసం ఉపయోగించానని వెల్లడించాడు.

Pune : పూణే లో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన

ఈ విషయంలో తన కుటుంబసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లినందుకు భార్య నాలుగు రోజులు మాట్లాడలేదని చెప్పాడు. అంతే కాకుండా తన మామయ్య పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ చేసి మాట్లాడారా అని అడిగినప్పుడు, తాను సమాధానం చెప్పలేకపోయానని తెలిపాడు. జనసేన కోసం ఖర్చు పెట్టినా, పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అయితే తన అభిమానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాడు. తనకు వ్యక్తిగతంగా ఏమీ ఆశ లేదు, నటించినప్పుడు కూడా పవన్‌తో ఫోటో కూడా తీసుకోలేదని పేర్కొన్నాడు. అభిమానం అనేది మనసులో ఉండాలని, తాను పవన్ కళ్యాణ్‌ను నిజమైన అభిమానిగా ప్రేమిస్తున్నానని షకలక శంకర్ తెలిపాడు. రాజకీయాలు అంటే ఒకరినొకరు విమర్శించడం కాదని, ప్రజల కోసం ఏం చేయగలమో చెప్పడమే నిజమైన రాజకీయమని అభిప్రాయపడ్డాడు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులంటే ఎంతో ఇష్టం కానీ, వారిని గుర్తుంచుకోవడం కొద్దిగా తక్కువేనని తన అనుభవాన్ని వెల్లడించాడు.

Drone To Moon : చంద్రుడిపైకి తొలిసారిగా డ్రోన్.. ఎందుకో తెలుసా ?