Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా ఎవరో మనకు తెలుసు. ఆయన ఇంటి పేరు కూడా తెలుసు. ఔను.. మనం మాట్లాడుకుంటున్నది షారుఖ్ ఖాన్, ఆయన ఇల్లు ‘మన్నత్’ గురించే. షారుఖ్ ముంబైలోని తన మన్నత్‌ను వదిలేసి, ఓ అద్దె ఇంట్లోకి మారుతున్నాడట. ఎందుకో ఈ వార్తలో తెలుసుకుందాం..
Also Read :Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ
నెలకు రూ.24 లక్షల అద్దె..
ముంబైకి వెళ్లే షారుఖ్ ఫ్యాన్స్ తప్పకుండా బాంద్రా వెస్ట్ ఏరియాలోని మన్నత్‌ను చూస్తారు. కొన్నిసార్లు తన అభిమానుల కోసం మన్నత్ అపార్ట్‌మెంట్ పైఅంతస్తులోని బాల్కనీలోకి షారుఖ్ వచ్చి, అభివాదం చేస్తుంటారు. ప్రేమపూర్వకంగా అభిమానులపైకి ముద్దుల వర్షం కురిపిస్తుంటారు. ఫ్లయింగ్ కిస్‌లతో అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. అందుకే మన్నత్ అనేది ఒక ఐకానిక్ ప్లేస్. తన ఇల్లు మన్నత్‌ను షారుఖ్ బాగా ఇష్టపడుతుంటారు. అలాంటి ఇంటిని వదిలేసి, త్వరలోనే బాంద్రాలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంటులో షారుఖ్ అద్దెకు దిగబోతున్నారట. దాని అద్దె నెలకు ఏకంగా రూ.24 లక్షలట. కనీసం 4 నెలలు అక్కడ అద్దెకు ఉన్నా.. షారుఖ్ అక్షరాలా కోటి రూపాయలను ఇచ్చుకోవాల్సి వస్తుంది.
Also Read :Drone To Moon : చంద్రుడిపైకి తొలిసారిగా డ్రోన్.. ఎందుకో తెలుసా ?
ఇల్లు ఎందుకు మారుతున్నాడు ?
వాస్తవానికి మన్నత్‌ను షారుఖ్(Shah Rukh Khan) నిర్మించలేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంత 16వ రాజు బిజయ్ సేన్ దీన్ని 19వ శతాబ్దంలో కట్టించారు. దానికి ‘విల్లా వియెన్నా’ అని పేరు పెట్టారు. ఈ భవనాన్ని షారుఖ్ ఖాన్ 2001లో కొనేసి, మన్నత్ అని పేరు పెట్టారు. తొలుత ఈ ఇంటికి జన్నత్ అని ఆయన నామకరణం చేశారు. కారణమేమిటో తెలియదు కానీ.. తర్వాత దీనికి మన్నత్ అనే పేరును ఫైనలైజ్ చేశారు. మన్నత్‌లో చాలా సినిమా షూటింగ్‌లు కూడా చేశారు. తదుపరి కాలంలో మన్నత్ భవనం లోపలి ఇంటీరియర్ డెకొరేషన్ బాధ్యతలను గౌరీ ఖాన్ తీసుకున్నారు. మన్నత్‌ను నిర్మించి చాలా ఏళ్లు పూర్తయింది. దీంతో ఇప్పుడు దానికి షారుఖ్ రీ ఇన్నోవేషన్ చేయిస్తున్నారు. ఆ పనులన్నీ పూర్తయ్యే దాకా కొన్ని నెలల పాటు ఫ్యామిలీతో కలిసి బాంద్రాలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంటులో షారుఖ్ ఉండబోతున్నారు. ఈ అపార్ట్‌మెంట్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీది అని తెలుస్తోంది.