Site icon HashtagU Telugu

Sekhar Kammula Leader 2 : లీడర్ 2 చేస్తున్న శేఖర్ కమ్ముల.. హీరో విషయంలో క్లారిటీ లేదు..!

Sekhar Kammula Plan that movie with Pawan Kalyan

Sekhar Kammula Plan that movie with Pawan Kalyan

Sekhar Kammula Leader 2 దగ్గుబాటి వారసుడు రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమా అప్పట్లో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను శేఖర్ కమ్ముల చాలా బాగా హ్యాండిల్ చేశారు. అవినీతి రాజకీయాల మీద తన మార్క్ పంచ్ వేసిన శేఖర్ కమ్ముల ఆ సినిమాతో తనలోని సామాజిక స్ప్రుహ అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఆ తర్వాత లీడర్ 2 కోసం ఎంత ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు.

We’re now on WhatsApp : Click to Join

లేటెస్ట్ గా లీడర్ స్క్రిప్ట్ రెడీ చేశాడట శేఖర్ కమ్ముల అందుకే ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 8గా సినిమా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ అదే నిర్మాణ సంస్థలో ధనుష్, నాగార్జునతో ధారావి అనే సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఆ సినిమా పూర్తి కాగానే లీడర్ 2 ఉంటుందని తెలుస్తుంది.

లీడర్ 2 లో రానా నటిస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. శేఖర్ కమ్ముల సినిమా కాబట్టి రానా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. అయితే తన డెబట్ మూవీగా చేసిన రానా ఇన్నేళ్ల కెరీర్ తర్వాత తంకు ఇప్పుడున్న ఈ ఇమేజ్ తో అలాంటి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూడాలి. లీడర్ 2 రానా చేస్తేనే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు.

అయితే ప్రస్తుతానికి అనౌన్స్ మెంట్ మాత్రమే వచ్చింది. త్వరలో ధారావి సినిమా పూర్తి చేసిన తర్వాతే లీడర్ 2 సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

Also Read : Aashika Ranganath : ఆషిక రంగనాథ్ ఆ విషయంలో చాలా సీరియస్ అట..!