హీరో విజ‌య్‌కు ఎఫైర్‌.. విడాకులు కోరిన భార్య‌!?

గతంలో ఈ జంట తరచుగా మీడియాలో కలిసి కనిపించేవారు. అయితే ఇప్పుడు సంగీత విడాకులు కోరడంతో తమిళ సినిమా, రాజకీయ రంగాల్లో పెద్ద చర్చ మొదలైంది.

Published By: HashtagU Telugu Desk
Hero Vijay

Hero Vijay

Hero Vijay: సౌత్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ భార్య సంగీత సోర్నలింగం తమ 25 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో విజయ్‌కు ఇతర వ్యక్తులతో, అధికారులతో సంబంధాలు ఉన్నాయని దీనివల్ల తమ వైవాహిక జీవితం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు.

సెలబ్రిటీ వర్గాల్లో ఈ విషయం వెంటనే చర్చనీయాంశమైంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. సంగీత చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ విజయ్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసినట్లు, అందుకే ఇకపై ఆయనతో కలిసి ఉండలేనని పేర్కొన్నారు.

Also Read: టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

గతంలో ఈ జంట తరచుగా మీడియాలో కలిసి కనిపించేవారు. అయితే ఇప్పుడు సంగీత విడాకులు కోరడంతో తమిళ సినిమా, రాజకీయ రంగాల్లో పెద్ద చర్చ మొదలైంది. విజయ్‌పై దాఖలైన ఈ పిటిషన్‌ను కోర్టు ఒక సున్నితమైన అంశంగా పరిగణించింది. తదుపరి విచారణలో భాగంగా కోర్టు ఇరుపక్షాల వాదనలను విననుంది.

26 ఏళ్ల వారి వైవాహిక బంధంలో ఏర్పడిన ఈ విభేదాల వార్త అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా ఈ న్యాయపోరాటం ఇప్పుడు చెన్నై ఫ్యామిలీ కోర్టుకు చేరింది.

విజయ్‌కు నోటీసులు జారీ

సంగీత సోర్నలింగం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఆమె విడాకుల కోసం డిమాండ్ చేస్తున్నారు. విజయ్- సంగీత వివాహం ఆగస్టు 1999లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల పిటిషన్‌ను చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విజయ్‌కి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 20న ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

సంగీత చేసిన పెద్ద ఆరోపణ

దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం,, సంగీత తన భర్త విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. సంగీత తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వివాహేతర సంబంధం గురించి ఆమెకు 2021లో తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాతే ఆమె చట్టపరంగా విడిపోవాలని (విడాకులు తీసుకోవాలని) నిర్ణయించుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమే వారి 26 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని ముగించే దిశగా ఆమెను పురికొల్పింది.

  Last Updated: 27 Feb 2026, 05:51 PM IST