Site icon HashtagU Telugu

Samantha : బాత్ టబ్‌‌లో ఫొటో షేర్ చేసిన సమంత.. భూటాన్‌లో ఫుల్ ఎంజాయ్..

Samantha Shares Photos from Bathroom in Bhutan Hotel Room

Samantha Shares Photos from Bathroom in Bhutan Hotel Room

సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి పలు దేశాలు తిరుగుతూ మయోసిటిస్ కి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఫోటో ఫోటోలు, తన ట్రావెల్ గురించి షేర్ చేస్తుంది.

ప్రస్తుతం సమంత భూటాన్(Bhutan) రాజధాని థింపులో ఉంది. గత వారం రోజులుగా భూటాన్ లో అన్ని ప్రదేశాలు తిరిగేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది సమంత. అలాగే మరోపక్క పలు ఆయుర్వేద చికిత్సలు కూడా తీసుకుంటుంది. తాజాగా భూటాన్ లో తాను ఉంటున్న హోటల్ రూమ్ నుంచి రెండు ఫోటోలు షేర్ చేసింది.

ఒక ఫొటోలో బాత్ టబ్ లో ఉండగా వెనక నుంచి తీశారు. మరో ఫొటో బాత్రూమ్ లో అప్పుడే స్నానం చేసి రెడీగా ఉన్నట్టు పోజ్ ఇస్తూ దిగింది. దీంతో సమంత రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది, దేశాలు తిరిగేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

Also Read : Jr NTR : రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ తనయుల ఫోటోలు బయటకి.. అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారా?