Samantha@16: ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే, సమంత టీనేజ్ ఫొటో వైరల్!

సమంత పాత రోజులకు గుర్తుకు చేసుకుంది. 16 ఏళ్ల వయసులో తాను ఎలా ఉందో తెలిపే ఫొటోను షేర్ చేసింది.

  • Written By:
  • Updated On - April 24, 2023 / 06:24 PM IST

టాలీవుడ్ నటి సమంత (Samantha) సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫాలోయింగ్ (Craze) ఉంది. ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో హాలీవుడ్ (Hollywood) హీరోయిన్ మాదిరిగా ఆకట్టుకొని ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. తాజాగా మరోసారి సమంత మెస్మరైజ్ చేసింది. సమంత పాత రోజులకు గుర్తుకు చేసుకుంది.

16 ఏళ్ల వయసులో (Teenage) తాను ఎలా ఉందో తెలిపే ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.  బ్లాక్ అండ్ వైట్ పిక్చర్‌లో సమంత పొడవాటి వస్త్రాలు వదులుగా ఉన్న పూల దుస్తులలో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత (Samantha) ఫొటో సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అవుతోంది. అమె అభిమానులు ఫిదా అవుతూ.. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరికైనా టీనేజ్ దశ చాలా ముఖ్యం. అబ్బాయిలు, అమ్మాయిలు ఉరకలేసే ఉత్సాహంతో కదం తొక్కుతుంటారు. అల్లర్లు, స్నేహితులు, చిలిపి చేష్టలు ఆ వయసులో సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో సమంత ఫొటో వైరల్ (Viral) అవుతోంది.

నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ ఇప్పటికీ చైతూ టాటూస్ ను చెరిపివేయలేదు. సమంత తన పక్కటెముకకు కుడి వైపున ‘ఛే’ టాటూ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో హల్ చల్ చేస్తోంది. కొన్ని నెలల క్రితం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసినప్పుడు ఓ అభిమాని టాటూ గురించి ప్రస్తావించాడు. వెంటనే సమంత ఒంటిపై టాటూలు వేయించుకోవద్దని, అందుకు చాలా కారణాలు ఉంటాయని చెప్పింది. జీవితంలో టాటూలు వేయించుకోవద్దంటూ బదులిచ్చింది.

Also Read: Aishwarya Rai: ఆ డైరెక్టర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా: ఐశ్వర్యా రాయ్